Presidential Election : ద్రౌపది ముర్ముకు భారీగా క్రాస్‌ ఓటింగ్‌..తెలంగాణలో విపక్షాల అభ్యర్థికి ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యే!

జార్ఖండ్‌, గుజరాత్‌కు చెందిన NCP ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేశామని వెల్లడించగా.. హర్యానా, ఒడిశా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు మద్దతుగా నిలిచామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Presidential Election : ద్రౌపది ముర్ముకు భారీగా క్రాస్‌ ఓటింగ్‌..తెలంగాణలో విపక్షాల అభ్యర్థికి ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యే!

Cross Voting

presidential election : దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. జార్ఖండ్‌, గుజరాత్‌కు చెందిన NCP ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేశామని వెల్లడించగా.. హర్యానా, ఒడిశా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు మద్దతుగా నిలిచామని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్డీఏ అభ్యర్థికి కాకుండా విపక్షాల అభ్యర్థికి ఓటు వేసిన ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరని చర్చ జరుగుతోంది. ఇక అస్సాంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని AIUDF ఎమ్మెల్యే బార్బియాన్‌ ఆరోపించారు.

Presidential Election : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సులు..ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలింపు

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనూ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రాస్ ఓట్ వేసినట్టు తెలుస్తోంది. శివపాల్ యాదవ్‌ ప్రగతిషీల్‌ సమాజ్‌వాది పార్టీకి చెందిన లోహియా..సిన్హాకు తన మద్దతు ఎప్పుడు లేదని ప్రకటించారు. యశ్వంత్ సిన్హాను ISI ఏజెంట్‌ అని సమాజ్ వాదీ చీఫ్‌ ములాయం సింగ్ యాదవ్‌ ఒకప్పుడు విమర్శించిన మాటలు గుర్తు చేశారు. అటువంటి వ్యక్తికి తాము ఎలా ఓటు వేస్తామని ప్రశ్నించారు.

హర్యానా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ కూడా ముర్ముకే తన ఓటు వేసినట్టు సంకేతాలు ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఒడిశాలో కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ మద్దతు తెలిపిన వ్యక్తికి కాకుండా ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.