ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ

ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ

public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామె. ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేంద్రం. ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు ఒకే చెప్పింది.

పార్లమెంట్ లో బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ చేయబోతున్నట్లు, ఇందుకు చట్టసవరణ చేస్తామన్నారు. 2021-22లో పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు వెల్లడించారామె. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచామన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఇది 9వ బడ్జెట్‌. అయితే..ఈ బడ్జెట్ ను పేపర్ లెస్ గా రూపొందించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ యాప్‌ ను కేంద్రం రిలీజ్ చేసింది. అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశామన్నారు. నిర్మలా సీతారామన్. లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం ఇచ్చామని సభలో వెల్లడించారు.