Rishabh Pant: ముందు మ్యాచ్ ముగించు.. తర్వాత ఎంజాయ్ చేద్దువ్.. – హార్దిక్ పాండ్యా

ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా అద్భుత విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్ క్రెడిట్ హార్దిక్.. పాండ్యా - రిషబ్ పంత్ లకే దక్కింది. మిడిలార్డర్ లో రెచ్చిపోయిన ఈ జోడీ.. హాఫ్ సెంచరీ.. సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేశారు.

Rishabh Pant: ముందు మ్యాచ్ ముగించు.. తర్వాత ఎంజాయ్ చేద్దువ్.. – హార్దిక్ పాండ్యా

Pandya Pant

 

 

Rishabh Pant: ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా అద్భుత విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్ క్రెడిట్ హార్దిక్.. పాండ్యా – రిషబ్ పంత్ లకే దక్కింది. మిడిలార్డర్ లో రెచ్చిపోయిన ఈ జోడీ.. హాఫ్ సెంచరీ.. సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేశారు.

“నేను ముందుగా చెప్పినట్లు అదే పనిని రిపీట్ చేస్తున్నా. మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పుదాం. ఎంజాయ్ చేద్దువ్ గానీ, ముందు మ్యాచ్ ఫినిష్ చేయమని చెప్పా. అప్పుడే ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. రిషబ్ పంత్ ఆడుతుంటే ఇక నువ్వు ఆడుకో అనుకున్నాం” అని హార్దిక్ పాండ్యా విజయం తర్వాత మాట్లాడుతూ అన్నాడు.

ఇంగ్లాండ్ బౌలర్లు కాదు, టార్గెట్ అసలు పట్టించుకోనే లేదు. ఒత్తిడి మచ్చుక్కైనా కనపడకుండా.. పంత్ చెలరేగిపోయి విజయానికి కీలకమయ్యాడు.

Read Also: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

260 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. మరో 47 బంతులు, 5 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు. పంత్ 113 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 16 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి