అఫ్రిదికి అల్లుడు కాబోతున్న యువ ఫేసర్ అఫ్రిది

అఫ్రిదికి అల్లుడు కాబోతున్న యువ ఫేసర్ అఫ్రిది

పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాడు.. సిక్సర్లతో విరుచుకుపడుతూ.. స్పిన్ మాయాజాలం చేసే మాజీ స్టార్‌ షాహిద్‌ అఫ్రిది పాకిస్తాన్ యువ పేస్‌ బౌలర్‌ షహీన్‌ షాని అల్లుడుగా చేసుకోబోతున్నాడు. అఫ్రిది తనయ అక్సాతో షహీన్‌ షాకు నిశ్చితార్థం జరగబోతోంది. ‘‘గత కొన్ని నెలలుగా రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను అఫ్రిది కుటుంబం అంగీకరించింది’’ అని షహీన్‌ షా తండ్రి అయాజ్‌ వెల్లడించారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో అఫ్రిదితో కలిసి ఆడుతున్న షహీన్‌.. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్నాడు.

ఈ వార్తలపై స్పందించిన మాజీ స్పిన్నర్ అఫ్రీది.. షాహిన్ షా‌ ఆఫ్రిది కుటుంబం తన కూతురు కోసం కుటుంబాన్ని సంప్రందించిందని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయి అని నమ్ముతున్నాం అని, రెండు కుటుంబాలు టచ్‍‌లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే షాహిన్‌ ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా నిలదొక్కుకుంటున్నాడని.. తమ కుమార్తె చదువులు కూడా ఇంకా ముగియలేదని.. ఇప్పట్లో నిశ్చితార్థం ఉండకపోవచ్చని యువ పేసర్ కుటుంబవర్గం తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ వార్తపై పాకిస్తానీ జర్నలిస్ట్‌ ఇతిషామ్‌ ఉల్‌ హక్‌ కూడా క్లారిటీ ఇచ్చారు.. షాహిన్‌ ఆఫ్రిది, అక్సా అఫ్రిది వివాహ వార్తలు నిజమేనని.. ఇరు కుటుంబాలు ఇ‍ప్పటికే పెళ్లికి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరగనుండగా.. పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగన్నట్లు చెప్పారు.