Matthew Hayden: మా అత్యుత్తమ ప్రదర్శన ఫైనల్‌లో చూపిస్తాం.. ఆ జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్ మెంటార్ హేడెన్
పాకిస్థాన్ ఫైనల్‌లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.

Matthew Hayden
Matthew Hayden: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం న్యూజీలాండ్ జట్టుతో పాకిస్థాన్ తలపడింది. కివీస్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో చేధించింది. 13 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది.
T20 World Cup 2022: సెమీఫైనల్‌లో పాకిస్థాన్ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన బాబర్ సేన
రెండో సెమీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. వీరిలో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్‌లో పాకిస్థాన్ తలపడనుంది. పాకిస్థాన్ ఫైనల్‌లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు. ఈ రాత్రి చాలా ప్రత్యేకమైనది. మీరు చూసిన ఆ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ నమ్మశక్యంకాని పని చేసింది. మేము మా అత్యుత్తమ ప్రదర్శనను ఇంకా చూడలేదని నేను అనుకుంటున్నాను. ఇది బహుశా ఫైనల్‌లో పాక్ తో తలపడే జట్టు చూడొచ్చని హెడెన్ అన్నాడు.
మెల్‌బోర్న్‌లో మంచి బ్యాటింగ్ ట్రాక్. ఆకాశమే హద్దుగా పాక్ బ్యాటర్లు విరుచుకుపడబోతున్నారు అంటూ హేడెన్ చెప్పాడు. 2007లో జరిగిన తొలి T20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. 2009లో శ్రీలంకను ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2010, 2012, 2021లో సెమీస్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం ఫైనల్ పోరులోకి పాకిస్థాన్ అడుగుపెట్టింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌తో తలపడేది ఇండియా, ఇంగ్లాండ్ జట్టా అనేది నేడు తేలనుంది.