ఏ టూత్ పేస్టు వాడుతున్నాడో?!: రాళ్లను బఠాణీల్లా తినేస్తున్నాడు..32 ఏళ్లుగా రాళ్లే ఆహారం..!!

ఏ టూత్ పేస్టు వాడుతున్నాడో?!: రాళ్లను బఠాణీల్లా తినేస్తున్నాడు..32  ఏళ్లుగా రాళ్లే ఆహారం..!!

Maharastra man Stones diet : మనకు ఆకలేస్తే అన్నం తింటాం. మరి కొంతమంది రొట్టెలు తింటారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం రాళ్లే ఆహారంగా తింటున్నాడు. గత 32ఏండ్లుగా రాళ్లనే ఆహారంగా తింటున్నాడు. రాళ్లను బఠాణీల్లా కరకరా నమిలేస్తున్నాడు. ప్రతిరోజూ రాళ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. సత్రా జిల్లాలోని అదార్కి ఖుర్ద్‌ గ్రామంలో నివసిస్తున్న రామ్‌దాస్ బోడ్కే అనే 72 ఏళ్ల వృద్ధుడు ఆరోగ్యం పరిస్థితి మాత్రం మామూలుగానే ఉండటం గమనించాల్సిన విషయం. ఆహారంగా రోజుకు 250 గ్రాముల రాళ్లే అతని ఆహారం..!!

78ఏళ్ల రామ్‌దాస్‌ ప్రతీరోజూ 250 గ్రాముల రాళ్లను ఆహారంగా తీసుకుంటాడు. చాలా రోజుల పాటు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడిన ఆయన రాళ్లు తినడం మొదలు పెట్టాడు. చాలా కాలం ట్రీట్ మెంట్ చేయించుకున్నప్పుటికీ అతడి నొప్పిని తగ్గించే మెడిసిన్ ఏదీ పనిచేయలేదు. కడుపు నొప్పితో ఇబ్బందిపడుతున్న రామ్ దాస్ తన గ్రామంలో నివసిస్తున్న ఒక వృద్ధ మహిళ సలహా ప్రకారం ప్రతీరోజూ తింటున్నాడు. రాళ్లు తింటే కడుపు నొప్పి తగ్గుతుందని చెప్పిందట ఆమె. దీంతో రాళ్లు తినటం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి రాళ్లు తినడం కొనసాగిస్తునే ఉన్నాడు రామ్ దాస్. రామ్ దాస్ తో రాళ్లు తినటం ఆపించటానికి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఫలితం దక్కలేదు.

కుటుంబసభ్యులు అతనికి రాళ్లు దొరక్కుండా చేసినా కూడా అతను రాళ్లు తినటం ఆపలేదంటున్నారు.
ఇటీవల రామ్‌దాస్‌ చాలా ఆనందంగా రాళ్లు తింటున్న వీడియో వైరల్‌ కావడంతో ఇప్పుడు అతడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు. కుటుంబసభ్యులు అతనికి రాళ్లు దొరక్కుండా చేసినా కూడా ఫలితం లేకపోయింది. రామ్‌దాస్‌కు రాళ్లు తినే అలవాటు అనేది మానసిక ఆరోగ్య సమస్య అయి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.