నిహారికతో ఫొటోలో ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే?

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 03:23 PM IST
నిహారికతో ఫొటోలో ఉన్న ఆ వ్యక్తి ఎవరంటే?

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం నిశ్చయమైంది అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిహారిక పెళ్లి విషయమై మెగా కుటుంబం నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిహారిక పోస్ట్ లను చూస్తే పెళ్లి మాట నిజమేనని అనిపిస్తోంది. ఆమె స్టార్ బక్స్కాఫీ కప్పు ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్చేశారు. ఆ కప్పుపై మిస్ నిహా (మిస్‌ని కొట్టివేసి) మిసెస్ ..? అని రాసి ఉంచారు. నిహారిక మరో ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

ఆ ఫొటోలో ఓ వ్యక్తిని నిహారిక కౌగలించుకుని నవ్వుతూ దిగినట్టుగా ఉంది. అంతేకాదు ఫొటోకు పీక్ఏ బూ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. అతని తల వెనుక భాగం మాత్రమే కనిపిస్తోంది. ఇంతకీ అతడు ఎవరు వ్యక్తి అన్నది సస్పెన్స్ ఇచ్చారు నిహారిక. ఆ ఫొటోను చూసినప్పటి నుంచి నిహారిక అభిమానులు అతడు ఎవరో చెప్పాలని కోరుతున్నారు.

ఇటీవలే ఓ వ్యాపారవేత్తతో నిహారిక వివాహం నిశ్చయమైనట్టు వార్తలు వచ్చాయి. ఆగస్టులో వీరిద్దరి పెళ్లి జరుగుతుందని అంటున్నారు. నిహారిక పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.