మెగా పవర్‌స్టార్ ముఖ్య అతిథిగా..

మెగా పవర్‌స్టార్ ముఖ్య అతిథిగా..

Uppena Blockbuster Celebrations: మెగా ఫ్యామిలీ మెంబర్ పంజా వైష్ణవ్ తేజ్, కన్నడ బ్యూటీ కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో.. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘ఉప్పెన’.. ఫిబ్రవరి 12న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

Uppena
అన్ని ఏరియాల నుండి మార్నింగ్ షో నుండే మంచి టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు, హీరో హీరోయిన్ల నటన, విజయ్ సేతుపతి విలనిజం, దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని దర్శకుడు ఎమోషనల్‌గా తెరకెక్కించాడంటూ సినీ ఇండస్ట్రీ వారు సైతం ప్రశంసిస్తున్నారు.

Uppena
టాలీవుడ్‌లో ఏ డెబ్యూ హీరోకి రానంత భారీ స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది ‘ఉప్పెన’.. మొదటి మూడు రోజులకే రూ. 50 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసి, వీక్ డేస్‌లోనూ అదరగొడుతుంది. తమ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం చేసినందుకు ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ‘ఉప్పెన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ పేరుతో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Uppena
రాజమండ్రి, వి.ఎల్.పురంలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. ఫిబ్రవరి 17సాయంత్రం 6 గంటల నుంచి ‘ఉప్పెన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ స్టార్ట్ కానుంది. ఈ కార్యక్రమానికి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Uppena