మే 13న ‘ఆచార్య’ ఆగమనం..

మే 13న ‘ఆచార్య’ ఆగమనం..

Acharya Release Date: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ 5:30కి ‘ఆచార్య’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Acharya Release Date

సమ్మర్ స్పెషల్‌గా మే 13 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆచార్య’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లో మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, తిరు సినిమాటోగ్రఫీ, మణిశర్య బ్యాగ్రౌండ్ స్కోర్, కొరటాల టేకింగ్, డైలాగ్స్ అన్నీ పక్కాగా హైలెట్ అయ్యాయి..  కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.