‘పాఠాలు కాదు.. గుణపాఠాలు చెప్పే ఆచార్య’..

‘పాఠాలు కాదు.. గుణపాఠాలు చెప్పే ఆచార్య’..

Acharya Teaser: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ టీజర్ వచ్చేసింది..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆసక్తికరంగా ఉంది.. ‘‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’’.. అంటూ చరణ్ వాయిస్ చెప్పాడు.. టీజర్ చివర్లో చిరు చెప్పిన ‘‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. అందరూ ఎందుకో ‘ఆచార్య’ అంటుంటారు.. బహుశా.. గుణపాఠాలు చెప్తాననేమో..’’ అనే డైలాగ్ అదిరిపోయింది.

మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, తిరు సినిమాటోగ్రఫీ, మణిశర్య బ్యాగ్రౌండ్ స్కోర్, కొరటాల టేకింగ్, డైలాగ్స్ అన్నీ పక్కాగా హైలెట్ అయ్యాయి.. చిరు లుక్, డైలాగ్ డెలివరీ మెగాభిమానులకు కిక్ ఇస్తున్నాయి..