Megastar Chiranjeevi: ప్రాణాపాయంలో మెగాభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
ఎవరికి ఆపద వచ్చినా, అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.

Megastar Chiranjeevi Helps Mega Fan In Critical Condition
Megastar Chiranjeevi: ఎవరికి ఆపద వచ్చినా, అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు.
దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు.. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరఫున ఆదుకున్న దొండపాటి చక్రధర్‌కి క్యాన్సర్ వ్యాధి సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇటీవల ఒమేగా హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు.
అంతేగాక ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ఆయనకు ధైర్యం కూడా చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి చక్రధర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే చక్రధర్‌కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు.