Chiranjeevi: అందరి వాడు మెగాస్టార్.. అందుకే అందరికన్నా డిఫరెంట్!

మెగాస్టార్ మామూలోడు కాదు మహానుభావుడు అంటున్నారు అందరూ. టాలీవుడ్ కి అల్టిమేట్ టాప్ హీరోగా, హీరోలందరకీ రోల్ మోడల్ గా స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న మెగాస్టార్ కి ఇది ఒక వైపు మాత్రమే.

Chiranjeevi: అందరి వాడు మెగాస్టార్.. అందుకే అందరికన్నా డిఫరెంట్!

Chiranjeevi (1)

Chiranjeevi: మెగాస్టార్ మామూలోడు కాదు మహానుభావుడు అంటున్నారు అందరూ. టాలీవుడ్ కి అల్టిమేట్ టాప్ హీరోగా, హీరోలందరకీ రోల్ మోడల్ గా స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్న మెగాస్టార్ కి ఇది ఒక వైపు మాత్రమే. అడిగిందే లేట్ ఆడియో ఫంక్షన్లకు రావడం, అడగకుండానే సినిమా వాళ్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యడం, యంగ్ టాలెంట్ ని యంకరేజ్ చెయ్యడం ఇది మెగాస్టార్ రెండో వైపు. అందుకే అన్నయ్య అందరికన్నా డిఫరెంట్ అని తెగ మురిసిపోతున్నారు అభిమానులు.

Chiranjeevi: మెగా లైనప్.. సెట్స్ మీద ఐదు సినిమాలు.. చర్చల్లో మరో ఐదు!

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కే కాదు.. ఇండియన్ సినిమాకే పరిచయం అక్కర్లేని పేరు. 66 ఏళ్ల వయసులో అప్పుడప్పుడు అలా వచ్చిఇలా వెళ్లిపోయే క్యారెక్టర్లు కాకుండా ఆచార్యగా వస్తున్నారు చిరంజీవి. ఈ ఏజ్ లో కూడా ఇంకా అంతే ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తున్న మెగాస్టార్.. నిజంగా మెగా లెవల్లో ఆలోచించే స్టార్ అంటున్నారు జనాలు. ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.. అడగకుంగానే వాళ్ల సమస్యల్ని సాల్వ్ చేస్తూ.. తన మెగా నేచర్ ని చూపిస్తూనే ఉన్నారు చిరంజీవి.

Chiranjeevi: మల్టీస్టారర్ మూవీలకు మెగాస్టార్ మక్కువ.. నెక్ట్స్ కూడా అదేనా..?

యంగ్ టాలెంట్ ని యంకరేజ్ చెయ్యడానికి ఎప్పుడూ ముందుంటారు చిరంజీవి. సమస్యల్నే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా.. ముందుకు రావడానికి రెడీ అంటారు చిరంజీవి. ఇండస్ట్రీలోని యంగ్ స్టర్స్ ని ఎంకరేజ్ చెయ్యడం, చిన్న సినిమాల ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతారు చిరంజీవి. మనంచేసే చిన్న హెల్ప్ తో వాళ్ల లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ల కెరీర్ కి బూస్టప్ ఇస్తుందంటే అలాంటి పనులు చెయ్యడానికి ఎప్పుడూ రెడీయే అంటారు చిరంజీవి.

Chiranjeevi : చరణ్‌కి ఇలా బర్త్‌డే విషెస్ చెప్పడం వింతగా ఉంది

సినిమా ఇండస్ట్రీ వల్లే, జనాల అభిమానం వల్లే తను ఇంత స్తాయికి వచ్చానని హంబుల్ గా చెప్పే మెగాస్టార్.. ఎక్కడా తన స్టార్ డమ్ ని చూపించే ప్రయత్నం చెయ్యలేదు. ఇండస్ట్రీ సమస్యల్ని ఎవరూ పట్టించుకోకపోయినా, అసలు సమస్యల్ని పరిష్కరించడానికి ఎవరూ రాకపోయినా.. ఆయనే ముందుండి టెక్కెట్ రేట్ల విషయంలో ముందుండి సమస్యని పరిష్కరించారని, ఇండస్ట్రీకి పెద్దగా కాకుండానే ఇండస్ట్రీకి బిడ్డగానే చిరంజీవి ఇవన్నీ చేశారని ఆకాశానికెత్తేశారు రాజమౌళి. ఇలా సినిమాకు సంబందించి ఏ సమస్యైనా, ఏ అవసరం అయినా.. లేదనకుండా కాదనకుండా తానే ముందుండి సెటిల్ చేస్తూ.. సెట్ చేస్తూ.. తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు మెగాస్టార్.