Chiranjeevi : మెగాస్టార్ న్యూ లుక్.. కిరాక్ అంటున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Chiranjeevi : మెగాస్టార్ న్యూ లుక్.. కిరాక్ అంటున్న ఫ్యాన్స్..

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. కొత్త సినిమాలను లైనప్ చేస్తూ తనకు తానే సాటి అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వం, తనయుడు రామ్ చరణ్ నిర్మాణంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు.

తర్వాత మోహన్ రాజా డైరెక్షన్‌లో మలయాళీ సూపర్ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ మూవీ కోసం చిరు సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. అందుకు సంబంధించిన మెగాస్టార్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మాజీ మంత్రి రఘవీరా రెడ్డి.. తన సొంత గ్రామం నీలకంఠపురంలో కట్టించిన ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న చిరంజీవి వీడియోను రఘవీరా రెడ్డి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. మెగాస్టార్ కొత్త లుక్ తర్వాతి సినిమా కోసమేనని, లేదు.. ‘ఆచార్య’ లోనూ ఈ లుక్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.