Pushpa: పుష్పలో మెగాస్టార్ ఎంట్రీ.. అభిమానులకు పండగే?

మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ పుష్ప కూడా ఒకటి. ఇప్పటికే ఆర్య, ఆర్య2 లాంటి సినిమాలతో క్రేజీ కాంబినేషన్ గా మారిన బన్నీ-సుకుమార్ పుష్ప సినిమాను మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు.

Pushpa: పుష్పలో మెగాస్టార్ ఎంట్రీ.. అభిమానులకు పండగే?

Pushpa Megastar

Pushpa: మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో అల్లు అర్జున్ పుష్ప కూడా ఒకటి. ఇప్పటికే ఆర్య, ఆర్య2 లాంటి సినిమాలతో క్రేజీ కాంబినేషన్ గా మారిన బన్నీ-సుకుమార్ పుష్ప సినిమాను మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమా మీద అంచనాలను ఆకాశానికి పెంచేశాయి.

పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం నుండి మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ ను కీలక పాత్ర కోసం ఎంచుకోవడం, స్పెషల్ సాంగ్స్ కోసం బాలీవుడ్ నుండి భామలను తీసుకోవడం వరకు పాన్ ఇండియా సినిమాకు ఏం కావాలో మేకర్స్ అన్నీ తీసుకొస్తున్నారు. కాగా, ఇప్పుడు మెగా అభిమానులు ఎగిరి గంతేసే ప్రచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదే పుష్పలో మెగాస్టార్ ఎంట్రీ ఉంటుందట.

బన్నీ కెరీర్ లో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్న పుష్పలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందని ఓ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగిపోతుంది. నిన్నటి వరకు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న యంగ్ హీరో తరుణ్ కూడా పుష్పతో రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరగగా.. ఇప్పుడు మెగాస్టార్ ఎంట్రీ ఉండనుందని ప్రచారం మొదలైంది. ఇది ఎంతవరకు నిజమో కానీ అదే జరిగితే మెగా అభిమానులకు పండగే!