బన్నీ చెల్లెలిగా మేఘా

బన్నీ చెల్లెలిగా మేఘా

Megha Akash: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కీలకపాత్ర కోసం బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మేఘా ఆకాష్‌ని ఫిక్స్ చేసింది మూవీ టీమ్. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘా ‘పుష్ప’లో అల్లు అర్జున్ చెల్లెలి క్యారెక్టర్ చేస్తోంది. త్వరలో ఆమె షూటింగులో పాల్గొనబోతోంది.

Pushpa

‘ఆర్య, ఆర్య-2’ తర్వాత బన్నీ-సుక్కు కాంబోలో వస్తున్న ‘పుష్ప’ మూవీపై భారీ అంచనాలున్నాయి.. ఆగస్టు 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.