Muslim Couple Married In Hindu Temple : హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి .. పెళ్లి పెద్దలుగా వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు

హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి జరిగింది. మతసామరస్యం వెల్లవిరిసిన ఈ పెళ్లి పెద్దలుగా వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు హాజరయ్యారు. దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు.

Muslim Couple Married In Hindu Temple : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం. హిందూ ముస్లిం భాయీ భాయీ అనే సనాతన దేశం. అటువంటి భారత్ లో పక్కపక్కనే విభిన్న మతాలకు చెందిన దేవాలయాలు ఉన్నాయి. ఏదోక సందర్భంగా మతసామరస్యం అనేది కనిపిస్తుంది భారత్ లో. ఎన్నో కులాలు,మతాలు,తెగలు నివసిస్తున్న ఈ పవిత్రభారతావనిలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా రాంపూర్ గ్రామంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ఓ ముస్లిం జంట వివాహం చేసుకుంది. హిందువుల దేవాలయంలో ఇద్దరు మస్లింలు ఒక్కటయ్యారు. భారతదేశంలోని ఏకత్వాన్ని సాటిచెప్పారు.
ఈ వివాహంలో మరో విశేషం ఏమిటంటే..హిందూదేవాలయంలో ముస్లింలకు దగ్గరుండి వివాహం జరిపించింది. విశ్వహిందూ పరిషత్( వీహెచ్‌పీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రతినిథులు.

రాంపూర్ గ్రామంలో నివసించే ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు.. సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక చేయాలని ఆ ముస్లిం కుటుంబాన్ని కోరారు. దానికి వారు కూడా అంగీకరించారు. దీంతో సత్యనారారణస్వామి వారి దేవస్థానంలో ముస్లిం జంట ఒక్కటైంది. ఈ మతసారస్యపు వేడుకకు హిందువులు, ముస్లింలు హాజరై నవ దంపతులను మనసారా ఆశ్వీరదించారు.

వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులతో పాటు మౌల్వీ, సాక్షులు, లాయర్ సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంచేందుకు, మత సామరస్య సందేశాన్ని చాటేందుకు హిందూ దేవాలయంలో నిఖా జరిపించామని హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ వివాహం గురించి దేవస్థానం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ మాట్లాడుతూ.. సనాతన హిందూ ధర్మ అందరినీ కలుపుకుని వెళ్లాలనే చెబుతోందని అది కేవటం చెప్పటమే కాదు చేతల్లో కూడా చేసి అది ఎంత వాస్తవమో అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు హిందూధర్మం మనుషులంతా ఒక్కటే అని చాటి చెబుతుందని..అందుకే ముస్లిం జంట వివాహాన్ని సత్యనారాయణ స్వామి ఆలయంలో ముస్లీం మత ఆచారం ప్రకారం నిర్వహించటానికి అనుమతించామని తెలిపారు.

మునుషుల మధ్య రాజకీయం ఉండకూడదని..మనుషులంతా ఒక్కటేనని ఇది ప్రతీ ఒక్కరు గుర్తించాలని పిలుపునిచ్చారు.అసలైన మతం అంటూ అందరు ఒక్కటే అనే భావన పెంపొందించుకోవటమేనన్నారు. హిందువుల గుడిలో జరిగిన ఈ ముస్లిం జంట పెళ్లికి రాంపూర్ గ్రామస్తులతోపాటు.. హిందూ పరిషత్ ప్రతినిధులు అందరూ హాజరు కావటం విశేషం.

ఈ వివాహం గురించి వధువు తండ్రి మాలిక్ సంతోషం వ్యక్తం చేశారు. నా కుటుంబానికి నా కుమార్తె వివాహానికి విశ్వహిందూ పరిషత్, ఆలయ ట్రస్ట్ తో పాటు స్థానికులు ఎంతో సహకరించారని అందరికి ధన్యవాదాలు అని తెలిపారు. వారే ఎంతో బాధ్యతగా నాకుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు