Kochi Metro : కొచ్చి మెట్రో రైలు ముందు స్టాఫ్ డ్యాన్స్‌లు.. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టెప్పులేయడం ఎందుకంటే?

మెట్రోల్లో రీల్స్, డ్యాన్స్‌లు నిషేధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ ప్రమోషన్లో భాగంగా మెట్రో సిబ్బందితో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా మెట్రో స్టాఫ్ చేసిన డ్యాన్స్ లు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరై వైరల్ అవుతున్నాయి.

Kochi Metro : కొచ్చి మెట్రో రైలు ముందు స్టాఫ్ డ్యాన్స్‌లు.. నిబంధనలకు విరుద్ధంగా ఈ స్టెప్పులేయడం ఎందుకంటే?

Kochi Metro

Kochi Metro :  మెట్రో రైళ్లలో రీళ్లు, డ్యాన్స్‌లు చేయడం నిషేధం. అయినా కొందరు ప్రయాణికులు వైరల్ అవ్వాలనే కుతూహలంతో రూల్స్ అతిక్రమిస్తున్నారు. తాజాగా కొచ్చి మెట్రో సిబ్బంది స్టెప్పులు వేశారు. లైవ్‌లో కాదు లెండి.. అయినా వాళ్లెందుకు స్టెప్పులు వేశారు?

kerala school : కొత్త అడ్మిషన్ల కోసం కేరళ స్కూల్‌ కొత్త కాన్సెప్ట్ అదిరిందిగా..

రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ స్టాఫ్ చేసిన కొన్ని వీడియోలు షేర్ చేసింది. మెట్రో యూనిఫాం వేసుకుని వచ్చిన ఓ లేడీ ఆగిపోయిన మెట్రో రైలు ముందు అద్భుతంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. తన చేతిని వెనక్కి ఊపుతూ కొలీగ్ ను పిలిచింది.. అక్కడికి వచ్చిన అతనితో ఆమె తెలుగు సినిమా దసరా తమిళ్ వెర్షన్ నుంచి ‘మైనారు వెట్టి కట్టి’ అనే పెప్పీ సాంగ్ కి డ్యాన్స్ చేశారు.

ఇక మరో వీడియోలో ఇద్దరు మహిళలు తమిళ చిత్రం ‘ఎనిమీ’లోని ట్రెండింగ్ సాంగ్ ‘తుమ్ తుమ్’కి స్టెప్పులు ఇరగదీశారు. రెండు వీడియోల్లో మెట్రో స్టేషన్ మాత్రం ఖాళీగా కనిపిస్తుంది. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అఫిషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేరైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Kerala Water Metro : దేశంలోనే తొలిసారి .. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

స్టాఫ్ డ్యాన్స్ అద్భుతంగా చేశారని.. ట్రెండ్‌ను ఎప్పుడూ ఫాలో అవ్వండని అభిప్రాయాలు పెట్టారు. ఇంతకీ ఈ ప్రమోషన్ ఎందుకంటే మెట్రో జర్నీ టారీఫ్‌ల వివరాలు, ఆఫర్ల కోసం ఈ హడావిడి అన్నమాట. కొన్ని రాష్ట్రాల్లో మెట్రోల్లో డ్యాన్స్ లు, రీల్స్ చేయకూడదన్న నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మాత్రం మెట్రోని ప్రమోట్ చేసుకునే క్రమంలో తమ స్టాఫ్‌తో డ్యాన్స్ లు చేస్తూ వీడియోలు షేర్ చేయడం గమనార్హం.