Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

చేపలు ఎక్కువగా దొరకాలంటే స్థానిక జలాశయాల్లో నీళ్లు బాగా ఉండాలి. నీళ్లుండాలంటే వర్షాలు పడాలి. వర్షాలు బాగా పడేందుకోసం నిర్వహించే ఒక సంప్రదాయంలో భాగమే ఈ పెళ్లి. ఈ సంప్రదాయంలో భాగంగానే ఒక్సాకా గ్రామ మేయర్, విక్టర్ హ్యూగో సోసా, ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు.

Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

Mexico Mayor

Mexico Mayor: మెక్సికోలో విచిత్ర సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన మేయర్ గత గురువారం మొసలిని పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్, మొసలిని పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉంది. అక్కడి పురాతన సంప్రదాయంలో భాగంగా మేయర్ ఈ పెళ్లి చేసుకున్నాడు.

Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష

మెక్సికోలో ఒక్సాకా అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడి ప్రజలు చేపలు పట్టి జీవిస్తుంటారు. తమ వృత్తి బాగా సాగి, చేపలు ఎక్కువగా దొరకాలంటే స్థానిక జలాశయాల్లో నీళ్లు బాగా ఉండాలి. నీళ్లుండాలంటే వర్షాలు పడాలి. వర్షాలు బాగా పడేందుకోసం స్థానికంగా నిర్వహించే ఒక సంప్రదాయంలో భాగమే ఈ పెళ్లి. మన దగ్గర వర్షాలు పడాలంటే కప్పలకు పెళ్లిల్లు చేయడం వంటి కొన్ని సంప్రదాయాలు ఎలాగో.. అక్కడ ఇలా నీళ్లలో ఉండే మొసలిని పెళ్లి చేసుకోవడం కూడా అలాగే. ఈ సంప్రదాయంలో భాగంగానే ఒక్సాకా గ్రామ మేయర్, విక్టర్ హ్యూగో సోసా, ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు.

BJP: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీజేపీకే మెజారిటీ

మొసలిని స్థానికులు ప్రకృతికి, భూమికి, దైవత్వానికి ప్రతీకగా భావిస్తారు. మొసలిని పెళ్లి చేసుకోవడమంటే ప్రకృతికి మనిషి దగ్గర కావడమే అని వాళ్లు నమ్ముతారు. అందుకోసమే ఈ పెళ్లి తంతు జరిగింది. ఈ పెళ్లి చాలా వైభవంగా, సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మొసలిని పెళ్లి కూతురులా ముస్తాబు చేశారు. వరుడైన మేయర్ పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. ఆ తర్వాత మొసలితో కలిసి ఊరేగింపుగా వెళ్లి పెళ్లి తంతు నిర్వహించారు. ఇలా పెళ్లి చేస్తే వర్షాలు బాగా పడతాయని వాళ్ల నమ్మకం.