పారామిలటరీ బలగాల్లో ట్రాన్స్ జెండర్లు!

  • Published By: madhu ,Published On : July 4, 2020 / 08:58 AM IST
పారామిలటరీ బలగాల్లో ట్రాన్స్ జెండర్లు!

మొన్నటి దాక హక్కుల కోసం పోరాడారు..ఉన్నత చదువులు చదివారు..కానీ సమాజంలో వారిని వివక్షగా చూస్తుంటారు. దీనివల్ల వారికి ఏ ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ప్రభుత్వాలు మాత్రం ఆదరించి..వారి మేలు కోసం చర్యలు తీసుకుంటుంటారు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నామో అర్థం అయ్యిందని అనుకుంటాం..ఎస్..వారే..ట్రాన్స్ జెండర్లు..(ఆడ కాని..మగ కాని వారు).

ట్రాన్స్ జెండర్ల విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకొనబోతోంది. ఏకంగా పారా మిలటరీ బలగాలలో అవకాశం కల్పించేందుకు పరిశీలన చేస్తోంది. త్వరలోనే వీరిని సైన్యం తీసుకొనే అంశాన్ని కూడా పరిశీలిస్తోందని సమాచారం.  పారా మిలటరీ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్లుగా నియమించే అంశంపై వైఖరి ఎంటో తెలుపాలని CAPF బలగాలను కేంద్ర హోం శాఖ కోరింది.

ITBP, BSF, CRPF, SSB విభాగాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని కేంద్రం ఫోకస్ పెట్టింది. పారా మిలటరీ బలగాల్లోకి తీసుకొనే అంశంపై ఆర్మీ అధికారులు సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. భారత ఆర్మీలోకి మహిళలు ఎంట్రీ ఇచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ శారీరకంతో పాటు..ఇతరత్రా విషయాల్లో ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపించారు. లింగబేధం సమస్య కాదని భారత మహిళా సైనికులు నిరూపించారు. ప్రస్తుతం ట్రాన్స్ జెండర్లపై కూడా ఉన్న అపోహలు తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది.

శరీరం ఫిట్ గా ఉంటే..లింగ బేధం అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమౌతుందని, సత్తా చూపించడానికి..దేశం కోసం వారి సేవలను వినియోగించుకోవాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు పూర్తయితే..ట్రాన్స్ జెండర్లకు నిజంగానే సువర్ణ అవకాశం లభించినట్లవుతుంది.

Read:భారత్‌పై చైనాతో కలిసి దూకుడు.. నేపాల్ ప్రధానికి పదవి గండం?