పాప్ సంగీతపు రారాజు : Michael Jackson’s Death Anniversary

పాప్ సంగీతపు రారాజు : Michael Jackson’s Death Anniversary

అతను స్టేజ్ మీద ఎక్కి..మైక్ అందుకుంటే..చాలు..ప్రతొక్కరి కాళ్లు..చేతులు ఆటోమెటిక్ గా కదులుతుంటాయి. గొంతు విప్పితే..అభిమానుల కేరింతలు మాములుగా ఉండదు. ప్రపంచ పాప్ సంగీతానికి రారాజు..ఇప్పటికే అర్థం అయ్యింది అనుకుంటా..ఎవరో..అతను…ఎస్..అతనే…Michael Jackson’s .

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా Michael Jackson’s 11వ వర్ధంతి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఫొటోలను, పాటలను షేర్ చేస్తూ..అభిమానాన్ని చాటుకుంటున్నారు.

2009, june 25వ తేదీన..యునెటైడ్ స్టేట్స్ లోని లాస్ ఏంజిల్స్ లో డ్రగ్స్ అధికంగా తీసుకోవడంతో పాప్ రాజు మైఖెల్ తుదిశ్వాస విడవడంతో…ప్రతొక్కరూ తీవ్ర షాక్ కు గురయ్యారు. ఇతని పూర్తి పేరు మైఖేల్ జోసఫ్ జాక్సన్. పాప్ ప్రియులు ముద్దుగా ఇతడిని మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు.

ఇతను 1958, ఆగస్టు 29వ తేదీన జన్మించారు. 9 మంది సంతానంలో మైఖేల్ ఏడోవాడు. చాలీచాలని సంపాదన ఉండడంతో మైఖేల్ దారిద్రాన్ని చవి చూశారు. వీటన్నింటినీ అధిగమిస్తూ…వెలుగులోకి వచ్చారు. అతని గొంతు నుంచి వెలువడిన పాటలు ఉర్రూతలూగించాయి. అనతి కాలంలోనే పాప్ లోకంలో ఒక మెరుపు మెరిశారు.

విభిన్నంగా ఉండే పాటలు, అతను వేసే స్టెప్స్ మైఖేల్ ను సూపర్ స్టార్స్ చేశాయి. 14వ ఏటనే సొంతంగా బాణీలను సమకూర్చుకున్నాడు. హృదయాలను ఆకట్టుకునే రచనలతో శ్రోతలను ఉర్రూతలూగించాడు. మొట్టమొదటి ప్రేమ పాట ‘బెన్’ సూపర్ డూపర్ హిట్టయింది. తన శరీరాన్ని ప్లాస్టిక్ సర్జరీతో మార్చుకున్నాడు.

అమెరికన్ – ఆఫ్రికన్ అనిపించుకున్నాడు. మైఖేల్ ఎక్కడ షోలు చేసినా..జనాలతో కిక్కిరిసిపోయేది. 1979లో ‘ఆఫ్ ది వాల్ ఆల్బమ్’ తో అతని కెరీర్ పైకి ఎదగడంలో కీలకం. 1987లో ‘బ్యాడ్’తో ఇక తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు. మైఖేల్ గొంతు నుంచి వెలువడిన పాట..అతను చేసే డ్యాన్స్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఎన్నో అవార్డులు వచ్చి పడ్డాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డులో అతని పేరు నమోదైంది.

కావాల్సిన డబ్బు, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనలో సామాజిక కోణం దాగి ఉందని నిరూపించాడు. పేదలను ఆదుకొనేందుకు ముందుకు వచ్చాడు. చేయాల్సిన సాయం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇతను స్థాపించిన అనాథశరణాలయాలున్నాయి.

‘మోస్ట్ సక్సస్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ఆల్ టైమ్ ’ పేరిట 13 గ్రామీ అవార్డులను ఆయన అందుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు ప్రపంచ పాప్ శ్రోతలను ఉర్రూతలూగించిన మైఖేల్ కేవలం 50 ఏళ్లకే తుది శ్వాస విడిచారు.

 

Read:  హీరో, డైరెక్టర్ Lip Lock..ఫొటో వైరల్