Microsoft : రష్యాలో నిలిచిన మైక్రోసాఫ్ట్ సర్వీసులు.. 400 మంది ఉద్యోగులకు ఉద్వాసన?

Microsoft : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

Microsoft : రష్యాలో నిలిచిన మైక్రోసాఫ్ట్ సర్వీసులు.. 400 మంది ఉద్యోగులకు ఉద్వాసన?

Microsoft Shuts Operations In Russia, Lays Off Over 400 Employees

Microsoft : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విక్రయాలను రష్యా భారీగా తగ్గించింది. దాంతో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు రష్యాలో కార్యకలాపాలను నిలిపివేసింది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో రష్యాలో తన వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. రష్యాలో కంపెనీ ఉద్యోగులను కూడా తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రష్యాలో కార్యకలాపాలను తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది మార్చిలో మైక్రోసాఫ్ట్ రష్యాలో తన విక్రయాలను నిలిపివేసింది.

బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. యుక్రెయిన్‌పై కొనసాగుతున్న దాడి కారణంగా మైక్రోసాఫ్ట్ రష్యాలో తన వ్యాపారాన్ని తగ్గించుకుంటుంది. ఆర్థిక దృక్పథంలో మార్పులు, రష్యాలో తమ వ్యాపారంపై ప్రభావం ఫలితంగా.. రష్యాలో తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం అనేక ఇతర పెద్ద టెక్ కంపెనీల మాదిరిగా కార్యకలాపాలను పూర్తిగా మూసివేసే పరిస్థితి లేదు. మైక్రోసాఫ్ట్ కూడా తొలగించే ఉద్యోగులకు కంపెనీ నుంచి పూర్తి సపోర్టు అందుతుందని తెలిపింది.

Microsoft Shuts Operations In Russia, Lays Off Over 400 Employees (1)

Microsoft Shuts Operations In Russia, Lays Off Over 400 Employees

ఈ క్లిష్ట సమయంలో తమ పూర్తి మద్దతు ఉందని ఉద్యోగులకు హామీ ఇచ్చినట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి చెప్పారు. IBM దేశం నుంచి వైదొలిగిన వెంటనే రష్యాలో కార్యకలాపాలను తగ్గించాలనే మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌పై జరుగుతున్న దాడి కారణంగా రష్యాలో తమ కార్యకలాపాలను ముగించుకుంటున్నట్లు కంపెనీ CEO ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. యుద్ధం పరిణామాలు పెరుగుతూనే ఉన్నాయని, అందుకే రష్యాలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Read Also : Microsoft: హైదరాబాద్ లో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్