Earthquake In Maharashtra : నాసిక్ సమీపంలో భూకంపం..భయాందోళనలో స్థానికులు

మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.

Earthquake In Maharashtra : నాసిక్ సమీపంలో భూకంపం..భయాందోళనలో స్థానికులు

Mild earthquake hits near Maharashtra Nashik

Earthquake In Maharashtra :మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బుధవారం (నవంబర్ 23,2022)తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నాసిక్ జిల్లాకుపశ్చిమాన రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. 19.95 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72.94 డిగ్రీల తూర్పు రేఖాంశంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) వెల్లడించింది.

Earthquake In Arunachal Pradesh : అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదు

భూమికి 5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందోనని తెలియక ఆందోళనకు గురి అయ్యారు.తరువాత అవి భూకంపం అని తెలిసి ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

Earthquakes in Himalayas : హిమాలయాల్లో గ్రహణం రోజు ప్రకంపనలు .. ఢిల్లీకి ముప్పు తప్పదంటున్న నిపుణులు..?!

ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. కాగా మంగళవారం జమ్మూకశ్మీరులోని లడఖ్‌ ప్రాంత కార్గిల్ జిల్లాలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.కార్గిల్‌కు ఉత్తరాన 191 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని అధికారులు చెప్పారు. తరచూ భూప్రకంపనలతో ప్రజలు తీవ్రంగా భయాందోళనలు చెందుతున్నారు. ఇలా భారత దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Earthquake-Lunar Eclipse : పౌర్ణమికి, భూకంపాలకు.. చంద్ర గ్రహాణానికి.. భూప్రకంపనలకు సంబంధముందా?