Milk Price : సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన పాల ధరలు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Milk Price : సామాన్యుడిపై మరో భారం.. పెరిగిన పాల ధరలు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Milk Price

Milk Prices Rise : ఏప్రిల్ 1 అంటే చాలు.. ప్రజలు భయపడే రోజుగా చెప్పాల్సి వస్తుంది. జనాలకు ఇది ఏమాత్రం నచ్చని డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏప్రిల్ 1 నుంచి చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా భారం పెరుగుతుంది. జేబుకి చిల్లు పడుతుంది. ఈ సంవత్సరం కూడా ఏసీలు, టీవీల ధరలు పెరగనున్నాయి. అలాగే రిఫ్రిజిరేటర్స్, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్ల ధరలూ పెరగనున్నాయి. టీవీల ధరలు కనీసం రూ.2వేల నుంచి రూ.3వేల మధ్య పెరిగే చాన్స్ ఉంది.

వీటికి తోడు.. ఇప్పటికే ఎక్కువగా ఉన్న పాల ధరలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. ముందుగా సంగం పాల ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొద్దిగా ధర పెంచుతున్నట్లు సంగం డెయిరీ ప్రకటించింది. లీటర్ పాలకు రూ.2 చొప్పున పెంచుతున్నారు. పాల ఉత్పత్తుల ధరల్లో మాత్రం మార్పు లేదన్నారు. ఈ ఒక్క కంపెనీ ధర పెంచినా చాలు.. మిగతా కంపెనీలు కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో సోలార్ ఇన్వెర్టర్లు, లాంతర్లు, ఆటోమొబైల్ పార్ట్స్, స్మార్ట్‌ ఫోన్ ఛార్జర్ కాంపోనెంట్స్, లిథియం అయాన్ బ్యాటరీ రా మెటీరియల్స్, ఇంక్ క్యాట్రిడ్జెస్, లెదర్ ప్రొడక్ట్స్, నైలాన్ ఫైబర్, ప్లాస్టిక్ బిల్డర్ వేర్స్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్, పాలిష్డ్ క్యూబిక్ జిర్కోనియా లాంటి ఐటెమ్స్ ధరలు పెరుగుతాయి. అన్నింటి ధరలు పెరగనుండటంతో పేద, మధ్య తరగతి వారు ఆందోళన చెందుతున్నారు. ఏం తినేది, ఏం కొనేది.. అసలు బతికేదెట్లా అని దిగాలుగా ఉన్నారు.