Harish Rao: తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధి భేష్: మంత్రి హరీష్ రావు

నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్నారు.

Harish Rao: తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధి భేష్: మంత్రి హరీష్ రావు

Harish

Harish Rao: నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో నీటి వనరుల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని అన్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారని.. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నామని హరీష్ రావు అన్నారు. 46 చెరువులను పునరుద్ధరించుకున్నామని, 4వేల చెక్ డ్యామ్ లను, 141 టీఎంసీల నిల్వసామర్ధ్యం గల రిజర్వాయర్లను నిర్మించుకున్నామని హరీష్ రావు అన్నారు. కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదన్న హరీష్ రావు..తెలంగాణలో భూగర్భజలాలు పెరిగాయని అన్నారు.

Also read: Prashanth Kishore: తెలంగాణపై పీకే ఫోకస్..!

రూ.6వేల కోట్లతో 4వేల చెక్ డ్యామ్ లను నిర్మించి.. భూగర్భజలాలు పెరిగేల చర్యలు తీసుకోవడంతో ఏడాది పొడువునా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు హరీష్ రావు వివరించారు. గోదావరి నదిపై 141 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించుకున్నామని భవిష్యత్ తరాల కోసం…నదులను కాపాడుకోవాలని హరీష్ రావు తెలిపారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104ఉంటే..2021లో తలసరి ఆదాయం రూ.2,78,933కు పెరిగిందని.. పట్టుదల ఉంటే కానిదేదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారని మంత్రి హరీష్ రావు అన్నారు.

Also read: Maharashtra I-T Raids : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోదాలు ఎందుకు లేవు ?

2014లో జీడీపీ రూ.5,500గా ఉండగా 2021లో జీడీపీ రూ.11,54,000లకు పెరిగిందని.. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం…3 ఏళ్ళు సమయం పట్టగా.. పూర్తి చేయడానికి మూడున్నరేళ్లే పట్టిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ సాగునీటి ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. మూసీ పునరుద్ధరణ పనులు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు…కొద్దిరోజుల్లోనే వాటి పనులు మొదలుపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also read: Jagadish Reddy: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సూర్యపేట అభివృద్ధి చెందింది: మంత్రి జగదీష్ రెడ్డి