Harish Rao : ఆపరేషన్ కు ముహూర్తాలు పెట్టడమేంటి? : మూఢనమ్మకాలపై మంత్రి హరీశ్ రావు సీరియస్

ప్రసవాల కోసం ముందుగానే అయ్యగార్ల దగ్గరకు వెళ్లి.. ముహూర్తాలు పెట్టించుకోవడంపై హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో మాతా శిశు ఆరోగ్యం కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు.. ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు.

Harish Rao : ఆపరేషన్ కు ముహూర్తాలు పెట్టడమేంటి? : మూఢనమ్మకాలపై మంత్రి హరీశ్ రావు సీరియస్

Harish Rao (1)

Minister Harish Rao : ఈ మూఢ నమ్మకాలు ఏంటి..? అసలు మనం ఎటు పోతున్నాం..? అయినా.. ఎవరో నిర్ణయించిన టైమ్‌కి మన బిడ్డను బలవంతంగా భూమ్మీదకు తీసుకురావడమేంటో..? జగిత్యాల జిల్లాలో నార్మల్ డెలివరీల సంఖ్య తగ్గిపోయి.. సిజేరియన్ల సంఖ్య పెరుగుతోన్న వేళ తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలివి..! ప్రసవాల కోసం ముందుగానే అయ్యగార్ల దగ్గరకు వెళ్లి.. ముహూర్తాలు పెట్టించుకోవడంపై హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో మాతా శిశు ఆరోగ్యం కేంద్రాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు.. ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు. సీ-సెక్షన్ ప్రసవాల సంఖ్య ఎక్కువగా జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఆపరేషన్ ప్రసవాల ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోందని హరీశ్‌రావు అన్నారు. ఆపరేషన్ ద్వారా ప్రసవం జరిగితే.. పుట్టిన గంటలోపు పిల్లలు తల్లిపాలు తాగలేకపోతున్నారని.. దీని వల్ల నష్టం వాటిల్లుతోందన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతోపాటు, వారిలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. 35 నుంచి 40 ఏళ్ల వయసు వచ్చాక మహిళలు బరువైన పనులు చేసుకోలేకపోతున్నారని.. గర్భసంచి తీసేయడం లాంటి కొత్త కాంప్లికేషన్లు వస్తున్నాయని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Andhra Pradesh: చేతబడి నమ్మకం.. కన్నతల్లి, తమ్ముడు, చెల్లిని చంపిన కిరాతకుడు!

నార్మల్ డెలివరీకి 10వేల రూపాయల ఖర్చు అయితే.. ఆపరేషన్‌‌కు 50 వేల రూపాయల వరకూ ఖర్చవుతోందన్నారు. డెలివరీ కోసం అయ్యగార్లను అడిగి ఆపరేషన్‌కు ముహూర్తం పెట్టుకుంటున్నారని.. ఈ మూఢ నమ్మకాలు ఏంటంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. మనం ఎటు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ ముహూర్తాల విషయమై జగిత్యాలలో ఉన్న అయ్యగార్లతో మీటింగులు పెట్టమని కలెక్టర్‌ను ఆదేశించానన్నారు. త్వరలోనే కలెక్టర్ అయ్యగార్లతో సమావేశం అవుతారన్నారు.