Harish Rao Medak : గిరిజనుల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు-హరీశ్ రావు

మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

Harish Rao Medak : గిరిజనుల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు-హరీశ్ రావు

Harish Rao Medak Tour

Harish Rao Medak : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మెదక్ లో పర్యటించారు. మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. గిరిజనులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగిందన్నారు.

తండాల అభివృద్ధి కోసం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. రూ.25 లక్షలతో గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాల కోసం రూ.600 కోట్లు కేటాయించామన్నారు. మెదక్ లో మూడు గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం నిధులు కేటాయించినట్టు మంత్రి తెలిపారు.

రజకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో సకల సౌకర్యాలతో రూ.కోటి 50 లక్షలతో దోబీ ఘాట్ ను యాంత్రీకరించినట్టు మంత్రి తెలిపారు. ఏటా.. నాయి బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ కోసం రూ.300 కోట్లు ఖర్చు పెడుతున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.