Indrakaran Reddy : మార్చి 28 నుంచి యాదాద్రిలో స్వయంభూ దర్శనం

యాదాద్రిలో మార్చి 21వ తేదీ నుంచి సుదర్శన మహా యాగం, 28న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కుంభ సంప్రోక్షణతో..

Indrakaran Reddy : మార్చి 28 నుంచి యాదాద్రిలో స్వయంభూ దర్శనం

Indrakaran Reddy

Indrakaran Reddy : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ పునః నిర్మాణ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. యాదాద్రిలో మార్చి 21వ తేదీ నుంచి సుదర్శన మహా యాగం, 28న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

కుంభ సంప్రోక్షణతో 28వ తేదీ నుంచి భక్తులందరికి యాదాద్రీశుడి స్వయంభూ దర్శనాలు ఉంటాయన్నారు. యాదాద్రీశుడి ప్రధానాలయం పనులన్నీ 99శాతం పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. ధ్వజస్తంభం బంగారం తాపడం పని ఈ నెలాఖరు వరకు పూర్తి అవుతుందన్నారు. సప్త గోపురాలపై కలశాల బిగింపు పనులు వచ్చే నెలాఖరు వరకు పూర్తి అవుతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధితో యాదాద్రి క్షేత్రం తెలంగాణ తిరుపతిగా సర్వాంగ సుందరంగా ముస్తాబైందని మంత్రి అన్నారు.

EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు

క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, దీక్షపరుల మండపం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రెసిడెన్సియల్ సూట్ పూర్తి అయిందన్నారు. ఎంట్రీ ప్లై ఓవర్ బిడ్జికి సంబంధించిన కేబుల్ లండన్ నుంచి తీసుకురావాల్సి ఉందని, మార్చి 20వ తేదీ వరకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కొండపైన బస్ బేకు సంబంధించి రూ.10 కోట్లు మంజూరు అయ్యాయని, ఆ పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మహా సుదర్శన యాగం జరిగే మార్చి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతి రోజు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Corona Side Effect: కరోనా నుంచి కోలుకున్నాక ఎదురయ్యే సమస్యలు ఇవే..!

”మార్చి 21 నుంచి వారం రోజుల పాటు 1008 హోమ గుండాలతో నిర్వహించే సుదర్శన యాగం, 28న మహా కుంభ సంప్రోక్షణతో స్వామి వారి నిజరూప దర్శనాలు ప్రారంభమవుతాయి. యాగానికి సంబంధించి ఇప్పటికే త్రిదండి‌ చినజీయర్ స్వామీజీ నుంచి 24 అంశాలకు సంబంధించిన సామగ్రి లిస్టు ఇచ్చారు. 75 ఎకరాల స్థలంలో 1008 హోమాది‌ గుండాలతో, 6వేల మంది రుత్వికులతో పూజలు జరుగుతాయి. ఇంత పెద్ద దేవాలయం అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో అందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారు. రాబోయే రోజల్లో యాదాద్రి, బస్వాపూర్ ప్రాంతమంతా ఆకుపచ్చని అందాలతో భక్తులకు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తుంది. టెంపుల్ సిటిపై 250 కాటేజీలు నిర్మాణం కానున్నాయి. ఆలయంలో అర్చకులు, రుత్వికులు మరికొంత మంది పెరగాల్సి ఉంది. భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి‌ చేస్తున్నాం” అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.