Minister KTR : బండి సంజయ్‌‌కు కేటీఆర్ లేఖ..దీక్ష పచ్చి అవకాశవాదమే

హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు...

Minister KTR : బండి సంజయ్‌‌కు కేటీఆర్ లేఖ..దీక్ష పచ్చి అవకాశవాదమే

Ktr

Minister KTR Letter : ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ సిగ్గులేని దీక్ష చేస్తున్నారని విమర్శిస్తూ.. ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని బీజేపీ గంగలో కలిపిందని.. నిరుద్యోగ దీక్ష చేయడానికి అసలు మీకు నైతికత ఉందా అంటూ ప్రశ్నించారు. బూటకపు దీక్షకు పూనుకుని రాష్ర్ట యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించే కుట్రనే ఈ దొంగ దీక్ష అంటూ మండిపడ్డారు. చిత్తశుద్ధి  ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అని సూచించారు.

Read More : Indian Army: అత్యాధునిక భద్రతతో కూడిన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసిన ఇండియన్ ఆర్మీ

లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి…మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పే దమ్ము మీకుందా అంటూ నిలదీశారు. కేంద్రంలోని ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగ రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత వారికే దక్కుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కానీ..అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ? నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఓ శ్వేతపపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు.

Read More : Coriander Stalks : కొత్తిమీర కాడలు ఆరోగ్యానికి మంచిదే..!

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15లక్షల ఖాళీలను ఇంకా ఎందుకు భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలని లేఖలో ఆయన సూచించారు. యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర బీజేపీది కాదా, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ యువతపై తమకు పేగు బంధం ప్రేమ ఉందన్నారు. నిజం నిప్పులాంటిదని.. ఆ విషయం తెలిసి కూడా.. బండి సంజయ్ దొంగ దీక్షకు దిగుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.