Minister KTR : కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కస్ నడుపుతోందా..? : కేటీఆర్

కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కర్ నడుపుతోందా..? అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

Minister KTR : కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కస్ నడుపుతోందా..? : కేటీఆర్

Ktr Criticized The Central Government

Minister KTR :కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కర్ నడుపుతోందా? అంటూ బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. దేశంలో రూపాయి పతనానికి కేంద్రం పెద్దల అవినీతే కారణం అని స్వయంగా ప్రధాని మోడీయే అన్నారని గుర్తు చేసిన కేటీఆర్ కేంద్రం సర్కార్ నడుపుతోందా?..సర్కర్ నడుపుతోందా? అంటూ విమర్శలు సంధించారు. కేంద్రం కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది అని..రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించకపోగా..అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తోంది అంటూ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం వడ్లు కొనే విషయంలో పక్షపాత ధోరణి అవలంభించింది అని స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిరసనల ద్వారా నిలదీసినా పట్టించుకోలేదని..పైగా తెలంగాణ రైతులను తెలంగాణ ప్రజలను కేంద్రం చులకన చేసి మాట్లాడింది అంటూ విమర్శించారు. నిన్నమొన్నటి వరకు కేంద్ర పెద్దలు తెలంగాణ బియ్యం వద్దన్నారు..ఇప్పుడు బియ్యం..వడ్లు వేయమంటున్నారు ఇలా పదే పదే రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కేటీఆర్.

కేంద్రంలో గతంలో ప్రభుత్వాలు రూ.56 లక్షల కోట్లు అప్పుచేశాయని కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.100లక్షల కోట్లు అప్పుచేసిందని విమర్శించారు. పైగా తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం అప్పులపాలు అయ్యిందని విమర్శలు చేస్తున్నారని..తెలంగాణ అప్పు చేసింది ప్రాజెక్టుల కోసమని..ప్రజలకు తాగునీరు. విద్యుత్ కోసమని ఈ విషయం తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు.బీజేపీ ప్రభుత్వం ఎంతగా భయపెట్టాలని అనుకున్నా కేసీఆర్ చాలా మొండి ఘటం ఎవ్వరికి లొంగరు..బెదిరింపులకు భయపడరు అని తేల్చిచెప్పారు. వాపును చూసి కొంద‌రు బ‌లుపు అనుకుంటున్నారు. బీజేపీ డ‌బుల్ ఇంజిన్ మోదీ, ఈడీ అని ఎద్దెవా చేశారు. మంచి ప‌నుల‌తో మ‌న‌సులు గెల‌వ‌డం బీజేపీకి తెలియ‌దని అన్నారు కేటీఆర్.