రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ : మంత్రి నిర్మలా ఐదో ప్యాకేజీ ప్రకటన

  • Published By: madhu ,Published On : May 17, 2020 / 06:00 AM IST
రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ : మంత్రి నిర్మలా ఐదో ప్యాకేజీ ప్రకటన

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో చివరి విడత ప్రకటన వెలువడింది. 2020, మే 17వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీకి సంబంధించి వివరాలు వెల్లడించారు. రాష్ట్రాలకు తగిన సహాయం అందించామన్నారు. కరోనా వైరస్ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.

మే 16 వరకు రైతుల ఖాతాల్లో రూ. 2 వేల నగదు అందచేసినట్లు, 8.19 కోట్ల మంది రైతులకు సాయం అందించామన్నారు. ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్ల నగదు బదిలీ చేశామన్నారు. జన్ ధన్ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరిందని, రూ. 10, 025 కోట్ల నగదు బదిలీ చేశామన్నారు. వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందన్నారు. 2.2 కోట్ల మంది నిర్మాణ రంగ కూలీలకు రూ. 3 వేల 950 కోట్లు, ఉజ్వల పథకం కింద రూ. 6.81 కోట్ల ఉఛిత గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశామన్నారు. 

లాక్ డౌన్ తర్వాతి..కార్యక్రమాలకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. 12 లక్షల మంది EPF ఖాతాదారులు ఒకేసారి నగదు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఏడు రంగాలపై దృష్టి సారించామన్నారు. వచ్చే మూడు నెలలు నిత్యావసర సరుకులు అందిస్తామని ఇప్పటికీ చెప్పడం జరిగిందని గుర్తు చేశారామె. సంక్షోభంలోనూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆతిథ్య రంగం, టూరిజం రంగాల్లో సంస్కరణలు ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది.