ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ

ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం

  • Published By: naveen ,Published On : May 11, 2020 / 09:42 AM IST
ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ

ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం

ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం ఆదేశాలతో ఏపీలో ఆర్టీసీ బస్సులు నడిపిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సుల్లో భారీగా చార్జీలు పెంచుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రయాణికులపై బాదుడుకు ప్రభుత్వం రెడీ అయ్యిందని, జేబులు గుల్ల కానున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలపై ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టత ఇచ్చారు.

చార్జీల పెంపు వార్తల్లో వాస్తవం లేదు:
లాక్ డౌన్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచుతారనేది అవాస్తవం అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారాయన. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఈ విషయంపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలతో ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్టు అయ్యింది. కాగా, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఆర్టీసీ బస్సులను ఏపీలో నడుపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

మే 18 నుంచి ఆర్టీసీ సర్వీసులు:
కాగా.. కరోనా లాక్ డౌన్ నిబంధనలతో గత 50 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణ వ్యవస్థ ఆగిపోయింది. ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీకి సంబంధించి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సుల సర్వీసులు నిలిపివేశాయి. తాజాగా కేంద్రం లాక్ డౌన్ విషయంలో కొన్ని సడలింపులు, మినహాయింపులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో మే 17 తర్వాత ఏపీలో రోడ్డెక్కేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సుల నిర్వహణకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు.

లాక్ డౌన్ 3 లో భారీ సడలింపులు ఇచ్చిన కేంద్రం:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3వ దశ లాక్ డౌన్ అమల్లో ఉంది. కాగా, ఈ లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దీంతో దాదాపు అన్ని వ్యవస్థలు ప్రారంభం అయ్యాయి. పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. రేపటి(మే 12,2020) నుంచి రైళ్లు కూడా నడవనున్నాయి. పలు రాష్ట్రాల మే 17 తర్వాత ఆర్టీసీ బస్సులు నడిపే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే సొంత వాహనాలు ఉన్నవారు తిరగొచ్చని కేంద్రం పర్మిషన్ ఇవ్వడంతో అంతా రోడ్లు ఎక్కుతున్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతో కఠినంగా లాక్ డౌన్ అమలు చేసినా కరోనాకు అడ్డుకట్ట పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం వల్ల కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, భారీగా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

Read More:

లాక్ డౌన్ సడలింపులో మరిన్ని వెసులుబాట్లు..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

* ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయాలు.. ఇక కండక్టర్ ఉండడు, 50 శాతం సీట్లే భర్తీ