ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తూ ఏడేళ్ల చెల్లిపై 14ఏళ్ల అన్న అఘాయిత్యం

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్

  • Edited By: naveen , October 31, 2020 / 02:06 PM IST
ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తూ ఏడేళ్ల చెల్లిపై 14ఏళ్ల అన్న అఘాయిత్యం

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్న అయ్యే మైనర్ బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 14ఏళ్ల వయసున్న బాలుడు తన ఏడేళ్ల చెల్లిపై అత్యాచారం చేశాడు. ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ ఆ బాలుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది.

స్నానం చేస్తుండగా చెల్లిపై అఘాయిత్యం:
కమ్మూరు గ్రామానికి చెందిన ఓ వ్వక్తి మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు. ఆమె మృతి చెందటంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కొడుకు సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు రావటంతో భార్య పిల్లలతోపాటు పుట్టింటికెళ్లింది. రేషన్‌కార్డులో వేలిముద్రల కోసమని ఆమె ఏడేళ్ల కూతురిని కమ్మూరుకు తీసుకొచ్చారు. మూడు రోజులక్రితం చిన్నారి స్నానం చేస్తుండగా అన్న వరుస అయిన 14 ఏళ్ల బాలుడు సెల్‌లో పోర్న్ వీడీయోలు చూస్తూ అత్యాచారం చేశాడు.

తీవ్ర నొప్పితో బాధపడిన చిన్నారి:
రెండు రోజుల క్రితం పుట్టింటిలో ఉన్న తల్లి దగ్గరికి చిన్నారి వెళ్లింది. మూత్ర విసర్జన సమయంలో చిన్నారి నొప్పితో బాధపడుతుండటం, రక్తం వస్తుండటంతో ఏం జరిగిందని తల్లి అడిగింది. జరిగింది చిన్నారి చెప్పింది. దీంతో ఆ తల్లి షాక్ కి గురైంది. ఆ వెంటనే చిన్నారిని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ పుణ్యమా అని అఘాయిత్యాలు:
మైనర్ బాలుడు తన చెల్లిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం సంచలనం రేపింది. పిల్లల్లో వస్తున్న విపరీత పోకడలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఫోన్ లో పోర్న్ వీడియోలు చూడటం, వాటి ప్రభావంతో ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కారణం అనే విమర్శలు వస్తున్నాయి. వీటి కారణంగానే పిల్లలు చెడిపోతున్నారని, చిన్న వయసులోనే దారి తప్పుతున్నారని వాపోతున్నారు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత జరుగుతోందో, చెడు ప్రభావం కూడా అంతే జరుగుతోంది. మరీ ముఖ్యంగా సెక్స్ వీడియోల వీక్షణ విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి నేరాలకు కారణమవుతున్నాయి. తెలిసీ తెలియని వయసులోనే కొందరు మైనర్లు వావి వరుసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు.

పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి:
ఈ పరిణామం మంచిది కాదంటున్నారు నిపుణులు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఇలా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే సరిదిద్దాలి. లేదంటే ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం విషయంలో పిల్లలను కనిపెట్టుకుని ఉండాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే.

Read More:

వరంగల్ లో హిజ్రా హత్య..లైంగిక వేధింపులే కారణమా?

లాక్ డౌన్ వేళలో..అక్రమ సంబంధాలు : వనపర్తిలో యువకుడి గొంతు కోసిన మహిళ