Viral News: 63 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం.. ఎలా దొరికిందో తెలుసా?

ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఉంగరాన్ని ఆ వ్యక్తి కూడా మర్చిపోయాడు. పోయిన ఉంగరం కోసం ఎంతో వెతికినా దొరకకపోవడంతో సదరు పోగొట్టుకున్న వ్యక్తి ఇక దాని మీద ఆశలు వదిలేసుకున్నాడు. అయితే.. 63 ఏళ్ల తర్వాత అతని వద్దకు వచ్చిన ఓ యువతి ఈ ఉంగరం మీదే కదా అంటూ..

Viral News: 63 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం.. ఎలా దొరికిందో తెలుసా?

Viral News

Viral News: ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఉంగరాన్ని ఆ వ్యక్తి కూడా మర్చిపోయాడు. పోయిన ఉంగరం కోసం ఎంతో వెతికినా దొరకకపోవడంతో సదరు పోగొట్టుకున్న వ్యక్తి ఇక దాని మీద ఆశలు వదిలేసుకున్నాడు. అయితే.. 63 ఏళ్ల తర్వాత అతని వద్దకు వచ్చిన ఓ యువతి ఈ ఉంగరం మీదే కదా అంటూ పోగొట్టుకున్న ఉంగరాన్ని తిరిగి ఇవ్వడంతో అతను ఆశ్చర్యం.. ఆనందానికి మించిన ఏదో భావనకు లోనయ్యాడు. అయితే.. ఆ ఉంగరాన్ని పోగొట్టుకున్న అతని వద్దకు చేర్చేందుకు ఆ యువతి చేసిన కృషి అంతా ఇంతా కాదు.

అమెరికాలోని బ్రోక్‌పోర్ట్‌కు చెందిన మేరీ జో ఓర్జెక్‌కు లాక్కవన్నా నగరంలో తన పూర్వీకులకు చెందిన ఇల్లు ఒకటి ఉంది. గతేడాది ఆమె ఆ ఇంటిని శుభ్రం చేస్తుండగా తన తండ్రి డ్రాయర్ లో ఓ అరుదైన ఉంగరం దొరికింది. నీలి వర్ణం రాయి పొదిగిన ఆ బంగారు ఉంగరం తన తన పూర్వీకుల‌ది కాద‌ని నిర్ధారించుకున్న ఆమె.. అది ఎవరిదో తెలుసుకుని వారి వద్దకు చేర్చాలని నిర్ణ‌యించుకుని ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ మేరకు ముందుగా తన తండ్రి చదివిన స్కూల్ కు వెళ్లి లైబ్రేరియన్‌ను సంప్రదించగా అది అక్కడే చదివిన 1955 బ్యాచ్ విద్యార్థికి చెందినదిగా తెలిసింది.

అయితే.. అక్కడ ఆమెకి అరవై ఏళ్ల క్రితం నాటి విద్యార్థుల రిజిస్టర్‌ లభించలేదు. దీంతో అదే స్కూల్ మాజీ లైబ్రేరియన్‌ ని సంప్రదించగా అతను 1955 నాటి రిజిస్టర్‌ను వెలికితీసి ఆ ఉంగరం యూజీన్ డార్మ్‌స్టెడ్టర్ అనే వ్యక్తిదిగా తెలిపారు. దాంతో యూజీన్‌ ఆచూకీ తెలుసుకునేందుకు ఓర్జెక్ ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఆయన లాక్కవన్నాలోనే ఉంటున్నారని, అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యార‌ని తెలుసుకుని యూజీన్‌ వద్దకు వెళ్లి ఆ ఉంగరాన్ని ఆయనకు చూపించింది. అది చూసిన 80 ఏండ్ల‌ యూజీన్ అంతులేని భావనకు లోనయ్యారట. ఆ ఉంగరాన్ని తిరిగి తనకు తీసుకొచ్చి తనకు ఇచ్చిన ఓర్జెక్‌ను మనస్ఫూర్తిగా అభినందించారట. ఆరు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఉంగరం పోగొట్టుకున్న వ్యక్తి వద్దకు చేరడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.