Madhya Pradesh : తప్పిపోయిన కొడుకు పెట్రోలు బంకులో దొరికాడు

ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడు ఓ పెట్రోలు బంకుకు వచ్చాడు. పెట్రోలు కొట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలిసింది. అతడిని ఇంటికి చేర్చడానికి బంకు సిబ్బంది చేసిన ప్రయత్నం అభినందనీయం.

Madhya Pradesh : తప్పిపోయిన కొడుకు పెట్రోలు బంకులో దొరికాడు

Madhya Pradesh

Viral News : 15 ఏళ్ల బాలుడు పెట్రోల్ బంక్‌కి వచ్చాడు. పెట్రోలు కొట్టించుకున్నాక డబ్బులు అడిగితే సమాధానం చెప్పలేదు. గట్టిగా నిలదీస్తే సమాధానం రాలేదు కానీ ఓ నిజం తెలిసింది.

Kedarnath Google Translate : కేదార్‌నాథ్‌లో తప్పిపోయిన ఏపీ మహిళ.. ఎట్టకేలకు కుటుంబంతో కలిపిన గూగుల్ ట్రాన్స్‌లేట్.. ఇంతకీ, వృద్ధురాలు ఎలా కలిసిందంటే?

మధ్యప్రదేశ్ శివపురిలోని ఖుబాత్ వ్యాలీకి సమీపంలో ‘ది హైవే ఫ్యూయల్స్’ అనే పెట్రోలు బంకు ఉంది. ఈ బంక్‌కి 15 ఏళ్ల బాలుడు పెట్రోలు కొట్టించుకోవడానికి స్కూటీపై వచ్చాడు. రూ. 200 పెట్రోలు కొట్టించుకున్నాక డబ్బులు అడిగితే మౌనంగా నిలబడ్డాడు. ఎంత అడిగినా సమాధానం రాకపోవడంతో సిబ్బంది బంకు సేల్స్ మేనేజర్‌కి  కంప్లైంట్ చేశారు. మేనేజర్ అడిగినా సమాధానం చెప్పకపోవడంతో పేపర్ ఇచ్చి రాయమన్నారు. చివరికి అతను పేపర్ మీద ‘కన్హా’ అని రాశాడు.

Missing Boy Found : పశువుల మేతకు వెళ్లి తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు.. రాత్రంతా అడవిలోనే

ఇక బాలుడి నుంచి ఎటువంటి వివరాలు తెలియకపోవడంతో స్కూటీ ఆర్సీ వివరాల ద్వారా ఫేస్‌బుక్‌లో వెతికారు. బాలుడు తప్పిపోయిన ప్రకటనతో ఓ పోస్టు కనిపించింది. వెంటనే అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు పెట్రోలు బంకు దగ్గరకు వచ్చి బాలుడిని కలుసుకున్నారు. పాలకోసం స్కూటీపై బయటకు వచ్చి ఆ తరువాత నుంచి కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎట్టకేలకు కొడుకు ఆచూకీ దొరకడంతో సంతోషంగా అతనిని  తీసుకుని గ్వాలియర్ వెళ్లిపోయారు. అలా ఆ బాలుడి కథ సుఖాంతమైంది.