టామ్ క్రూజ్‌కి కోపం వచ్చింది.. ఆడియో లీక్ అయింది.. ఎందుకంటే..

టామ్ క్రూజ్‌కి కోపం వచ్చింది.. ఆడియో లీక్ అయింది.. ఎందుకంటే..

Mission Impossible 7: Tom Cruise.. స్వీట్ సిక్స్‌టీ ఇయర్స్‌కి దగ్గరవుతున్న ఈ హాలీవుడ్ స్టార్ హీరో.. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో రానున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూట్‌లో బిజీగా ఉన్నారు. ఎప్పుడూ యాక్టివ్‌గా తన స్టైల్ యాక్షన్‌తో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే టామ్ క్రూజ్‌కి కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా చేస్తే మీ ఉద్యోగాలు ఊడపీకేస్తాను అంటూ తెగ ఫైర్ అయిపోయారు. మరి ఆయనకి ఎందుకు కోపమొచ్చిందో ఏంటో తెలుసుకుందాం.

హాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది టామ్ క్రూజ్‌కి. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో 7, 8 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ తెరకెక్కిద్దామని ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ. అందుకే సెవెన్‌కి సంబంధించి లాక్‌డౌన్ తర్వాత టామ్ క్రూజ్ షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా చేస్తున్నారు. పర్ఫెక్షన్ కోసం పరితపిస్తూ.. చిన్న చిన్న విషయాల్లో కూడా డీటెయిల్డ్‌గా ఉండే టామ్ క్రూజ్‌కి మిషన్ ఇంపాజిబుల్ మూవీ టీమ్ మీద కోపమొచ్చింది. టీమ్ మెంబర్స్ మీద ఫుల్ ఫైర్ అవుతున్న ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Tom Cruise

మిషన్ ఇంపాజిబుల్ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా ఉన్న టామ్ క్రూజ్.. తన క్రూ మీద కోప్పడడానికి కారణం ఏంటంటే.. సెట్‌లో సరైన కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించకపోవడమేనట.. ‘అసలే లాక్‌డౌన్‌లో కోట్లలో నష్టపోయింది సినిమా ఇండస్ట్రీ. చాలా మంది రోడ్డు మీదకి వచ్చేశారు. కానీ మనం టైమ్‌కి తిండి తినగలుగుతున్నాం. అది గుర్తు పెట్టుకుని పనిచెయ్యండి, నేను ఎప్పుడూ రెస్పాన్సిబుల్‌గా ఉంటాను. నా టీమ్ కూడా అలా బాధ్యతతో ఉండాలనే అనుకుంటాను.. రెస్పాన్సిబుల్‌గా పనిచేసే వాళ్లనే పనిలోకి తీసుకుంటాను. పని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని నేను సహించను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే.. ఉద్యోగాలు ఊడ పీకేస్తాను’.. అంటూ టామ్ ఫుల్ క్లాస్ పీకారు తన క్రూ మెంబర్స్‌కి.

ఈ వయసులో కూడా సినిమా కోసం సాహసాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ ఆడియెన్స్ కోసం తన హెల్త్‌ని కూడా రిస్క్‌లో పెడుతున్నారు టామ్. అందుకే అంతగా తమ యూనిట్ మీద కోప్పడుతున్నారని ఫీల్ అవుతున్నారు టామ్ ఫ్యాన్స్ .యమా ఫాస్ట్‌గా తెరకెక్కుతున్న మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీ 2021 జూన్ 23 న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ కరోనా ఎఫెక్ట్‌తో సినిమాని నవంబర్ 19, 2021 కి పోస్ట్‌పోన్ చేశారు. అదీ సంగతి..

Mission: Impossible 7 Italy Shoot To Halt Due To Corona Virus Effect