Prabhas: హాలీవుడ్​కు ప్రభాస్​.. స్పందించిన మిషన్ ఇంపాజిబుల్ డైరెక్టర్!

ప్రభాస్.. ప్రభాస్.. ఎక్కడ విన్నా ప్రభాస్ నామ జపం జరిగిపోతుంది. బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. అది కూడా దక్షణాది నుండి ఉత్తరాది వరకు క్రేజీ దర్శకులతో జత కట్టాడు.

Prabhas: హాలీవుడ్​కు ప్రభాస్​.. స్పందించిన మిషన్ ఇంపాజిబుల్ డైరెక్టర్!

Director React On Prabhas Hollywood Entry

Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ఎక్కడ విన్నా ప్రభాస్ నామ జపం జరిగిపోతుంది. బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా సినిమా స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. అది కూడా దక్షణాది నుండి ఉత్తరాది వరకు క్రేజీ దర్శకులతో జత కట్టాడు. ఇంతవరకు మన కళ్ళముందు కనిపిస్తున్నదే కాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పడిచచ్చే ఓ సిరీస్ లో ఈ ఎంట్రీ ఉండనుందని ప్రచారం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి హాలీవుడ్​ చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. మిషన్ ఇంపాజిబుల్​ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్ గుర్తింపు ఉంది. ఇందులో టామ్ క్రూజ్​ చేసే స్టంట్స్​కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ సిరీస్​లో 7వ భాగమైన ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మన రెబల్ స్టార్ హాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని.. మిషన్ ఇంపాజిబుల్ 7లో ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

ఇందుకు నమ్మేవిధంగా మంచి అబద్దాన్ని కూడా సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులలో ఒకటైన రాధేశ్యామ్ ఆ మధ్య ఇటలీలో షూటింగ్ జరిగింది. సరిగ్గా అక్కడే మిషన్ ఇంపాజిబుల్ 7 కూడా షూటింగ్ జరుగగా దర్శకుడు క్రిస్టోఫర్ మెక్​క్వారీ ప్రభాస్​ను కలిసి కథ వివారించడంతో పాటు ఓ ముఖ్య పాత్రను ప్రభాస్ కోసం అఫర్ చేయడం.. అందుకు ప్రభాస్ ఒకే చెప్పటం జరిగిపోయిందని ఆ ప్రచారం సారాంశం. అయితే ఈ విషయంపై మెక్​క్వారీ తాజాగా స్పందించాడు.

https://twitter.com/chrismcquarrie/status/1397456441708003333

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీపై ఓ నెటిజన్ మిషన్ ఇంపాజిబుల్ దర్శకుడు మెక్​క్వారీని సంప్రదించగా దర్శకుడు కూడా నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా రీ ట్వీట్ చేశాడు. ప్రభాస్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు కానీ తాను ప్రభాస్​ను ఎప్పుడూ కలవలేదని మెక్​క్వారీ స్పష్టం చేశాడు. సోషల్ మీడియా ద్వారానే ఇదంతా జరిగిందని దర్శకుడు వెల్లడించాడు.