నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది, ఎమ్మెల్యే రోజా

mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్రీవాలను ఆపటం ఆయనపై ఆయనకు నమ్మకం లేదనిపిస్తోందని అన్నారు. ప్రజల తీర్పును హాస్యాప్పదం చేయడం తగదని రోజా అన్నారు. చిత్తూరు కలెక్టర్ ని తొలగించి ఎస్ఈసీ తన మనుషులను నియమించుకున్నారు. అయినా జిల్లాలో పంచాయతీ ఏకగ్రీవాలను నిలుపుదల చేయడం చాలా విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారని విమర్శించారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏక్రగీవాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏక్రగీవ ఫలితాలు ఇప్పుడే ప్రకటించొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఈ మేరకు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లకు ఆయన ఆదేశాలిచ్చారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని, ఫిర్యాదులు పరిష్కరించాకే ఫలితాలు ప్రకటించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారు. ఫిర్యాదులపై నివేదిక పంపాలని కలెక్టర్లను కోరారు. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగినట్లు గుర్తించామన్నారు.