MLC Kavitha Letter ED : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. మార్చి11న విచారణకు హాజరవుతా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు.

MLC Kavitha Letter ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు. మార్చి 9న విచారణకు రాలేనని.. మార్చి 11న విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. మార్చి 9న ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని కవిత తెలిపింది. అయితే హడావిడి విచారణపై ఈడీని కవిత నిలదీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడీ కార్యాలయానికి రమ్మనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేదేమీ లేదని చెప్పారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

అంతకముందు ఈడీ నోటీసులపై కవిత స్పందిస్తూ తాను మార్చి9న విచారణకు హాజరు కాలేనని మార్చి15 తరువాతే విచారణకు హాజరవుతానని ఈడీకి లేఖ రాశారు. మార్చి10న ఢిల్లీలో మహిళల రిజర్వేషన్లకు సంబంధించి నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని ఇది ముందుగానే నిర్ణయించిన కార్యక్రమం అని అందుకే 15 తరువాతే తాను విచారణకు హాజరు అవుతాను అని లేఖలో పేర్కొన్నారు. తాజాగా రాసిన లేఖలో మాత్రం మార్చి 11న విచారణకు హాజరవుతానని కవిత చెప్పారు.

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం అసాధ్యం.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బుధవారం(మార్చి8,2023) ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం(మార్చి9,2023) ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తోంది. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది.

దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించబోతున్నారు. ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రను ఈడీ ప్రస్తావించింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. 9న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా ఈడీ కవిత పేరును ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గురువారం(మార్చి9,2023) జరగబోయే విచారణ కీలకం కానుంది. కాగా, విచారణకు కవిత మార్చి 9న హాజరవుతారా? లేదా మార్చి 11న హాజరువుతారా? చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు