MLC Kavitha: ఎలాంటి విచారణకైనా సిద్ధం.. ఎన్నికల ముందు ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీకి కొత్తకాదు..

ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు..

MLC Kavitha: ఎలాంటి విచారణకైనా సిద్ధం.. ఎన్నికల ముందు ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీకి కొత్తకాదు..

MLC Kavitha

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు మోదీ వచ్చే ముందు ఈడీ, సీబీఐలు రావడం కామన్. ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టించడం బీజేపీ అలవాటుగా మారింది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత అన్నారు.

Delhi liquor scam: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు

మాపై కేసులు రాజకీయ ఎత్తుగడ, ఎలాంటి విచారణకైన మేము సిద్ధమని కవిత స్పష్టం చేశారు. ఎన్ని ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతాం. కేసులకు భయపడం. జైల్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు అంటూ ప్రశ్నించారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్న కవిత, మీడియాలో లీకులు ఇచ్చి మా ఇమేజ్ ను దెబ్బతీయలేరని అన్నారు. టీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐలతో ముప్పేట దాడులు చేస్తున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavitha Vs YS Sharmila : టీఆర్ఎస్ MLC కవిత ట్వీట్‌కు.. YS షర్మిల కౌంటర్ ట్వీట్

ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనం ఏంచేస్తామో చెప్పి ఎన్నికల్లో గెలవాలని, ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదని కవిత అన్నారు. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం, ప్రజలకోసం టీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాదని కవిత అన్నారు.