పెళ్లిలో మోడ్రన్ సప్తపది : అగ్నిహోత్రం చుట్టూ డ్యాన్సులు వేస్తూ..ఏడు స్టెప్పులు..

పెళ్లిలో మోడ్రన్ సప్తపది : అగ్నిహోత్రం చుట్టూ డ్యాన్సులు వేస్తూ..ఏడు స్టెప్పులు..

dancing pheras wedding divides :  ఒకప్పుడు పెళ్లి కూతురు అంటే సిగ్గులొలుకుతూ..కూర్చునేది. కాలం మారింది. అమ్మాలు మారారు. ఎంతగా మారారంటే..పెళ్లి పీటల మీదకి డ్యాన్సులేసుకుంటూ వచ్చి కూర్చుంటున్నారు. పెళ్లి బారాత్ లలో నడిరోడ్లమీద చిందులేస్తున్నారు. గుర్రాలపై ఊరేగుతూ వస్తున్నారు. అటువంటి ఓ మోడ్రన్ పెళ్లి కూతురు తమ పెళ్లి జరిగిన తరువాత అగ్నిహోత్రం చుట్టూ నడిచే ‘సప్తపది’ (ఏడు అడుగులు)లో కూడా డ్యాన్సులు వేసింది. అగ్నిహోత్రం చుట్టూ ‘ఏడు అడుగులు’కాకుండా ‘ ఏడు స్టెప్పులు’ వేసింది భర్తతో సహా..పెళ్లికూతురు డ్యాన్సులు వేసుకుంటూ ముందు నడుస్తుంటే ఆమెవెనకే వరుడు కూడా డ్యాన్సులు వేసుకుంటూ తిరిగాడు.

పెళ్లిలో వధూవరుల్దిరూ కలిసి అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.  సప్తపదిలో భాగంగా వధూవరులిద్దరూ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం హిందూ వివాహాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.

ఈ వేడుకలో వధూవరులు నృత్యం చేస్తుంటే అతిథులు వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో కామెంట్‌ చేస్తున్నారు. ఈ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అయి..చర్చకు దారి తీసింది. దీనిపై అనేక మంది తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.