KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా

ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని ప్రధాని నరేంద్ర మోదీని అడిగినా పెట్టడం లేదని, ఇప్పుడైనా మీరు టైం చెప్పండి.. 8లక్షల కోట్లు తెస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాహూల్ గాంధీ, కేసీఆర్, ఈరోజు మోదీ మీటింగ్ పెడుతున్నారని, అయితే జనాలను మాత్రం డబ్బులు ఇచ్చి మీటింగ్ లకు తీసుకొస్తున్నారని అన్నారు.

KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా

Ka Poul

KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని ప్రధాని నరేంద్ర మోదీని అడిగినా పెట్టడం లేదని, ఇప్పుడైనా మీరు టైం చెప్పండి.. 8లక్షల కోట్లు తెస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, ప్రధాన మంత్రిని కలవాలి, కేసీఆర్ కలవకపోవడం దురదష్టకరం అన్నారు. హైదరాబాద్ లో మొత్తం టీఆర్ఎస్ బ్యానర్లతో నింపేశారని అన్నారు. అన్ని పార్టీల నేతలు తమ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు. గతంలో రాహూల్ గాంధీ, కేసీఆర్, ఈరోజు మోదీ మీటింగ్ పెడుతున్నారని, అయితే జనాలను మాత్రం డబ్బులు ఇచ్చి మీటింగ్ లకు తీసుకొస్తున్నారని అన్నారు.

KA Paul: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..

బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటున్నారని, రాజకీయ నేతలుగా ఉండి అలా మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల్లో 50లక్షల కోట్లు అప్పు చేశారని కేంద్రం తీరుపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని, నల్లదనం తెస్తామని అదీ చేయలేదని, కానీ అదానికి మాత్రం లాభం చేకూర్చారంటూ మోదీ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, భయంలో వారు బతుకుతున్నారని కేఏ పాల్ అన్నారు. మహిళలకు రక్షణ లేదని, 3ట్రిలియన్ డాలర్లు ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్లు చేస్తామన్నారని, కానీ చేయలేదని అన్నారు. దేశం ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడ ఫ్లెక్స్ ల కోసం కొట్లాట ఏమిటంటూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతల తీరుపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చెల్లించిన పన్నులు కేంద్రం నుండి తిరిగి రావడం లేదని పాల్ అన్నారు.

KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్

ఎనిమిదేళ్లు బీజేపీకి సీఎం కేసీఆర్ సహకరించారని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలేదని కేఏ పాల్ ఆరోపించారు. అప్పులు పెరిగాయని, కేసీఆర్ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకొని 10వేల కోట్లు ఖర్చు చేసి మళ్ళీ గెలుస్తామని కేసీఆర్ అనుకుంటున్నారని, ప్రజలు ఈసారి కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని పాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రాజకీయాల్లో ఏపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పాల్ అన్నారు. వచ్చేవారం విశాఖలో మీటింగ్ పెడుతున్నానని, అందరూ రావాలంటూ పాల్ కోరారు.