Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ Modi Speech at isb hyderabad

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

తన ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఐఎస్‌బీ కీలక మైలురాయిని చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్‌బీ ఆసియాలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

Modi Speech: తన ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఐఎస్‌బీ కీలక మైలురాయిని చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఎస్‌బీ ఆసియాలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిబ్బంది, విద్యార్థులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మోదీ విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి మాట్లాడారు.

PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే

‘‘ఐఎస్‌బీ విద్యార్థులు అనేక స్టార్టప్‌లు ప్రారంభించారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. మీకు మీ మీద నమ్మకం ఉందా? వీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించండి. మీరు చేపట్టబోయే కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ప్రతిక్షణం ఆలోచించండి. మన విధానాలు, నిర్ణయాలను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితులు వచ్చాయి. జీఎస్టీ నుంచి జాతీయ విద్యా విధానంలో సంస్కరణల వరకు ఎన్నో మార్పులు మీలాంటి యువతరం కోసమే చేపట్టాం. మా ప్రభుత్వం ఎప్పుడూ యువత వెంటే నిలబడింది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్‌ఫామ్ గురించి నేనెప్పుడూ చెబుతుంటా. పాలసీ విధానాలు పేపర్లపై అద్భుతంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఉపయోగపడకపోతే ప్రయోజనం ఉండదు. కరోనా సమయంలో విదేశీ వ్యాక్సిన్ దొరుకుతుందా? దొరకదా? అనే ఆందోళన ఉండేది. కానీ, మనమే సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ అందించాం. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. వైద్య కళాశాలలను 380 నుంచి 600కుపైగా పెంచాం. 2014 నుంచి మన అథ్లెట్లలో ఆత్మవిశ్వాసం పెంచాం. ఖేలో ఇండియా నుంచి ఒలింపిక్స్ వరకు మన క్రీడాకారులు సత్తాచాటారు. ప్రపంచంలో అత్యధిక డిజిటల్ లావాదేవీలు మన దేశంలోనే జరుగుతున్నాయి. జీ 20 దేశాల్లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది.

Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ మనది. గత ఏడాది భారత్‌కు భారీ స్థాయలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలోని వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈ ఘనత ప్రభుత్వ ప్రయత్నాల వల్లే సాధ్యం కాలేదు. భారత్ సాధించిన విజయాల్లో ఐఎస్‌బీ విద్యార్థులు, యువత పాత్ర ఎంతో ఉంది. భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ప్రపంచవ్యాప్త సమస్యలకు పరిష్కార మార్గాలు మన దేశంలోనే దొరుకుతున్నాయి. యువత దేశాన్ని ఏలే విధంగా శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దాదాపు 35 నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. కార్యక్రమం అనంతరం ఆయన బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ్నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు.

×