Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు

అల్లూరి సభకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. అల్లూరి పేర్లు ఎంతమంది గుజరాతీలు పెట్టుకున్నారో చెప్పాలి. ఈ సభకు చిరంజీవికి ఆహ్వానం అందింది. పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం రాలేదు. అల్లూరిని బీజేపీ పార్టీలోకి తీసుకుపోవాలని చూస్తున్నారు.

Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు

Chalasani Srinivas Rao

Chalasani Srinivas Rao: అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ సభకు తాము వ్యతిరేకం కాదని, అయితే అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ ఏపీకి వచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస రావు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. అనంతరం భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటనపై చలసాని ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Mexico Mayor: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలుసా!

‘‘అల్లూరి సభకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. అల్లూరి పేర్లు ఎంతమంది గుజరాతీలు పెట్టుకున్నారో చెప్పాలి. ఈ సభకు చిరంజీవికి ఆహ్వానం అందింది. పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం రాలేదు. అల్లూరిని బీజేపీ పార్టీలోకి తీసుకుపోవాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రధాని ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తారు? విశాఖ రైల్వే జోన్‌కు దిక్కు లేదు. కొందరు ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ అంటున్నారు. అలాంటివాళ్లు ఆంధ్రా ద్రోహులు. తెలుగు వ్యక్తి రాష్ట్రపతి అయ్యుంటే సంతోషించే వాళ్లం. వెంకయ్య నాయుడును ఒక బంగారు పంజరంలో బంధించారు.

BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు

రేపు ప్రధాని రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. రాష్ట్ర ప్రయోజనాల మీద కచ్చితమైన హామీ తీసుకుని, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ ఓటు వేయాలి. అన్ని పార్టీలు ఒక్కటై రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, హరితాంధ్రగా చూడాలి అనుకుంటే బూతులాంధ్రగా మార్చేశారు. ప్రజలకు న్యాయం జరగడం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి పోరాడాలి. ఈ పోరాటంలో టీడీపీ, జనసే, సీపీఎం, సీపీఐ కూడా కలుస్తాయి. బీజేపీ నేతలు ఏపీకి నిధులు ఇచ్చాం అంటున్నారు. వంద రూపాయలు తీసుకుని రూపాయి ఇస్తున్నారు. జీవీఎల్ నరసింహా రావుకు సవాల్ విసురుతున్నా. గుజరాత్‌లో మెట్రోకు రూ.19,500 కోట్లు ఇస్తే, ఏపీకి రూ.1 లక్ష ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్ని స్మార్ట్ సిటీలున్నాయి.

Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు

పక్క రాష్ట్రంలో 15 స్మార్ట్ సిటీలు ఇచ్చారు. 2014లో సమైక్యాంధ్ర కోసం నిలబడి ఉంటే చిరంజీవి సీఎం అయ్యేవారు. పవన్ కల్యాణ్ బీజేపీ దృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటకు వచ్చి, ఏపీ ప్రయోజనాల కోసం పోరాడాలి. కేసీఆర్‌ను ప్రశంసించాలి. తన రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీపై పిడికిలి బిగించి పోరాటం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది బలిదానం చేశారు. బీజేపీ వాళ్లకు ఇది ఒక వ్యాపార వస్తువులాగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని పార్టీలు కలిసి పోరాడాలి. రాష్ట్రాన్ని గుజరాత్ వ్యాపారులు దోచుకుంటున్నారు’’ అని చలసాని వ్యాఖ్యానించారు.