Mohammed Shami : షమీ@150.. తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డ్

టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డేలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్ గా, భారత్ తరఫున తొలి బౌలర్ గా నిలిచాడు.

Mohammed Shami : షమీ@150.. తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డ్

Mohammed Shami

Mohammed Shami : టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డేలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. షమీ వన్డేల్లో 150 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న 3వ బౌలర్ గా నిలిచాడు. కాగా, భారత్ తరఫున వేగంగా 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఘనత సాధించాడు. 80 మ్యాచుల్లోనే షమీ 150 వికెట్లు తీశాడు.

Surya Kumar Yadav: ఇండియా మిస్టర్ 360 అని సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు

77 మ్యాచుల్లో 150 వికెట్లు తీసి ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. 78 మ్యాచుల్లో 150 వికెట్లు తీసి పాకిస్తాన్ బౌలర్ ముస్తాక్ రెండో స్థానంలో ఉన్నాడు. 80 మ్యాచుల్లో 150 వికెట్లు తీసిన ఘనత అందుకున్న అప్ఘానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ తో కలిసి షమీ 3వ స్థానంలో ఉన్నాడు.

ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో షమీ అదరగొట్టాడు. మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రెయిగ్ ఓవర్ టన్ వికెట్లను షమీ తీశాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మరో బౌలర్ బుమ్రా బంతితో నిప్పులు చెరిగాడు. ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను తక్కువ స్కోర్ కే కుప్పకూల్చాడు.

IndVsEng 1st ODI : అదరగొట్టిన భారత్.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ

వన్డేల్లో వేగంగా వికెట్లు తీసిన రికార్డ్ భారత బౌలర్ అజిత్ అగార్కర్ పేరున ఉండేది. అగార్కర్ 97 మ్యాచుల్లో 150 వికెట్లు తీశాడు. ఇప్పుడా రికార్డును షమీ బద్దలుకొట్టాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో.. సమష్టిగా రాణించి ఇంగ్లండ్ పై సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల టార్గెట్ ను టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 18.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. భారత బౌలర్లు బుమ్రా, షమీ బంతితో నిప్పులు చెరిగారు. బుమ్రా ఏకంగా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.