#IndependenceDay: ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన మోహన్ భాగవత్

75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్ఎస్ఎస్ టార్గెట్‭గా విపక్షాలు సహా నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కారణం, ప్రధాని పిలుపు మేరకు వారి డీపీలు జాతీయ జెండాలోకి మారలేదు

#IndependenceDay: ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసిన మోహన్ భాగవత్

Mohan Bhagwat hoists Tricolour at RSS headquarters

#IndependenceDay: నాగపూర్‭లోని రాష్ట్రీయ స్వయం సేవక్ కేంద్ర కార్యాయలంలో ఆ సంస్థ అధినేత మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలాపన నడుమ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‭లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మోహన్ భాగవత్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి ఒకరోజు ముందు సైతం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ‘ఉత్తిష్ఠ భారత్’ అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని, దేశం కోసం జీవితాన్ని అర్పిస్తానని ప్రతిజ్ణ చేయాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాగా, 75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్ఎస్ఎస్ టార్గెట్‭గా విపక్షాలు సహా నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కారణం, ప్రధాని పిలుపు మేరకు వారి డీపీలు జాతీయ జెండాలోకి మారలేదు. ఈ విమర్శల నడుమ ఎట్టకేలకు శనివారం ఆర్ఎస్ఎస్, మోహన్ భాగవత్ సహా ఇతర ఆర్ఎస్ఎస్ నేతల డీపీలు త్రివర్ణ పతాకంలోకి మారాయి.

RSS changed DP: విమర్శల నడుమ ఎట్టకేలకు డీపీ మార్చిన ఆర్ఎస్ఎస్