Lucifer 2 : మోహన్ లాల్ లూసిఫర్‌2.. అబ్రహాం ఖురేషి ఎవరు.. ఈ సారి అంతకు మించి..

మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా మరో హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’ సినిమా భారీ విజయం సాధించింది. మలయాళంతో పాటు వేరే భాషల్లో కూడా ఈ సినిమా...........

Lucifer 2 : మోహన్ లాల్ లూసిఫర్‌2.. అబ్రహాం ఖురేషి ఎవరు.. ఈ సారి అంతకు మించి..

lucifer 2

Lucifer 2 :  మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా మరో హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’ సినిమా భారీ విజయం సాధించింది. మలయాళంతో పాటు వేరే భాషల్లో కూడా ఈ సినిమా ఓటీటీ ద్వారా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి ప్రీక్వెల్‌ ను ప్రకటించారు చిత్ర యూనిట్. అంటే ఇందులో హీరో గతాన్ని ఈ సినిమాకి ముందు పార్ట్ ని చూపించనున్నారు. లూసిఫర్‌ 2 గా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రకటించారు. ఈ సినిమాకి క్యాప్షన్ గా ఎంపురాన్‌ అని పెట్టారు అంటే తెలుగులో రాజు కన్నా గొప్పవాడు అని అర్ధం.

 

‘లూసిఫర్‌’ సినిమాలో మోహన్‌లాల్‌ స్టీఫెన్‌ గట్టుపల్లి అనే ఓ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియా లీడర్ అబ్రహాం ఖురేషిగా ఉన్నాడు అని క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారు. సినిమాలో ఈ ట్విస్ట్ బాగా క్లిక్ అవ్వడంతో మంచి హిట్ అయింది. అయితే లూసిఫర్ సెకండ్ పార్ట్ లో అసలు ఒక సాధారణ వ్యక్తి స్టీఫెన్‌.. అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు? అతడు చేసిన పనులు ఏంటి? ఎందుకు రాజకీయ నాయకుడిగా మారాడు అని చూపించనున్నట్టు తెలుస్తుంది.

Arjun Kapoor : మా సహనాన్ని చేతకానితనంగా భావించి మా సినిమాలని బాయ్‌కాట్‌ చేస్తున్నారు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి..

ఇప్పటికే ‘లూసిఫర్‌’ సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరి లూసిఫర్ 2 కూడా రీమేక్ చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. లూసిఫర్ 2 రిలీజ్ అయ్యేలోపే గాడ్ ఫాదర్ రిలీజ్ అవ్వనుంది. లూసిఫర్ 2 సినిమాని ప్రకటించడంతో మలయాళం ప్రేక్షకులే కాక అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.