Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మొహిందర్ కె.మిదా అనే మహిళా కౌన్సిలర్‌ను వెస్ట్ లండన్‌లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు.

Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతి మహిళ

Mohinder K Midha

Mohinder K Midha: భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మొహిందర్ కె.మిదా అనే మహిళా కౌన్సిలర్‌ను వెస్ట్ లండన్‌లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు. మిదా ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళ మాత్రమే కాకుండా, బ్రిటన్‌లో ఈ పదవి చేపట్టిన తొలి దళిత మహిళ కూడా కావడం విశేషం. మిదా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారు. మిదా ఎన్నికపై బ్రిటన్‌లోని ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ (ఫ్యాబో) హర్షం వ్యక్తం చేసింది.

Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

బ్రిటన్‌లో ఫ్యాబో సంస్థ దళిత హక్కులపై పోరాడుతుంది. మిదా ఈ నెల 5న జరిగిన ఎన్నికలో డోర్మర్స్ వెల్స్ వార్డ్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు కూడా ఆమె అదే స్థానం నుంచి గెలుపొందారు. మిదా మేయర్‌గా ఎన్నిక కావడంపై లేబర్ పార్టీ కూడా సంతోషం వ్యక్తం చేసింది.