Moinabad farmhouse case: ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టే ఎత్తివేత

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో ఉంచింది. అలాగే, కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది.

Moinabad farmhouse case: ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టే ఎత్తివేత

High Court-Venkat Balmoor (President, NSUI Telangana)

Moinabad farmhouse case: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాంహౌస్ వేదికగా చోటుచేసుకున్న ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో ఉంచింది.

అలాగే, కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై ఈ నెల 18న మళ్ళీ విచారణ జరపనుంది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత ప్రేమేందర్‌ రెడ్డి కొన్ని రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ పై ఓ వైపు వాదనలు కొనసాగుతుండగా మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై సింగిల్‌ బెంచ్‌ ఇటీవలే స్టే విధించింది. ఆ స్టేనే ఇవాళ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసు సంబంధించిన ముగ్గురు నిందితులను మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకుంటామని విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..