చిన్నారిపై లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు షాకింగ్ కామెంట్స్ : అవి వేధింపులు కాదు..పోక్సో చట్టం కిందకు రావు

చిన్నారిపై లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు షాకింగ్ కామెంట్స్ : అవి వేధింపులు కాదు..పోక్సో చట్టం కిందకు రావు

Mombay hc  pants zip not sexual assault under pocso act : 12ఏళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు షాకింగ్ ట్విస్టు ఇచ్చింది. సాక్షాత్తూ ధర్మాసనమే విచిత్ర వ్యాఖ్యలు చేసి విస్మయానికి గురిచేసింది. పట్టుమని 15 ఏళ్లు కూడా లేని అమ్మాయిపై అసహ్యకరమైన విధంగా చేసి లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు జస్టిస్‌ పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

సదరు బాలిక కేసులో ‘‘ఆమె చేతులు పట్టుకోవడం, వేధింపులకు పాల్పడిన వ్యక్తి తన ప్యాంటు జిప్‌ తెరిచి చూపించటం తరువాత పలు రీతిల్లో వ్యవహరించటం వంటి చర్యలు పోక్సో చట్టం కిందకు రావనీ అవి నేరాలుగా పరిగణించబడవని పేర్కొన్నారు జస్టిస్‌ పుష్ప గనేడివాలా. అయితే భారత శిక్షాస్మృతి 354-ఏ(1)(i) సెక్షన్‌ కింద వీటిని లైంగిక వేధింపులుగా పరిగణించవచ్చని అన్నారు. యాభై ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో జస్టిస్‌ పుష్ప ఈ వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన విషయం.

తమ 12ఏళ్ల కూతురు పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బిడ్డకు మాయమాటలు చెప్పి పక్కకు తీసుకువెళ్లి..ఆమె చేతులు పట్టుకుని తాకరాని చోట తాకాడనీ..అతని ప్యాంటు విప్పేసి అసహ్యంగా సైగలు చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అనతరం అతడిని సెషన్స్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతనిపై పోక్సో చట్టంలోని సెక్షన్‌ 10 కింద తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించింది.

దీంతో సదరు శిక్ష పడిన వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నిందితుడి చర్యను లైంగిక దాడి అనలేమని, కాబట్టి ఐపీసీ సెక్షన్‌ 354A (1) (i) ప్రకారం మాత్రమే శిక్షకు అర్హుడని తేల్చి చెప్పింది.

కాగా ఈ సెక్షన్‌ ద్వారా నిందితుడికి మూడేళ్లపాటు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా జనవరి 19 నాటి తీర్పులో జస్టిస్‌ పుష్ప ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.