Corona Cases : దేశాన్ని కుదిపేస్తున్న కేరళ.. అత్యధిక కేసులు అక్కడే!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆదివారం 14,28,984 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందురోజు 41,831 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Cases : దేశాన్ని కుదిపేస్తున్న కేరళ.. అత్యధిక కేసులు అక్కడే!

Corona Cases (8)

Corona Cases : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా నిత్యం 40 వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆదివారం 14,28,984 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 40,134 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందురోజు 41,831 కరోనా కేసులు నమోదయ్యాయి.

క్రితం రోజుతో పోల్చుకుంటే 4 శాతం కరోనా కేసులు తగ్గాయి. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఇక ఆదివారం కరోనాతో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లకు చేరింది. ఇక కరోనా కారణంగా 4.24 లక్షల మంది మృతి చెందారు.

ఇక గత కొద్దీ రోజులుగా యాక్టివ్ కేసుల రేటు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం 4,13,718 మంది వైరస్ తో బాధపడుతున్నారు. యాక్టివ్ కేసుల శాతం 1.30గా ఉంది. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. నిన్న 36,946 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.08 కోట్లుగా ఉంది. మరోవైపు నిన్న 17లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 47.22కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.